ETV Bharat / bharat

షెడ్యూల్​ ప్రకారమే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు! - #monsoon session

కరోనా దృష్ట్యా.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ఆలస్యమవుతాయనే ప్రచారం నేపథ్యంలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా స్పందించారు. కొవిడ్​-19 సంక్షోభం ఉన్నా.. షెడ్యూల్​ ప్రకారమే సభా సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిపారు. అయితే.. అప్పటి పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చారు.

Despite COVID, hopeful that Monsoon Session could be held on time: Lok Sabha Speaker
షెడ్యూల్​ ప్రకారమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!
author img

By

Published : May 10, 2020, 5:21 PM IST

కరోనా ప్రభావం పార్లమెంటు సమావేశాలపైనా పడింది. బడ్జెట్​ సెషన్​ను కరోనా వ్యాప్తి దృష్ట్యా 10 రోజుల ముందుగానే ముగించినా.. ఇప్పుడు వర్షాకాల సమావేశాలూ నిర్ణయించిన సమయానికి జరుగుతాయా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. కారణం... కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం. ఈ ఆందోళనల నడుమ స్పందించిన లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా.. వర్షాకాల సెషన్​ షెడ్యూల్​ ప్రకారమే నిర్వహించాలని చూస్తున్నట్లు చెప్పారు.

కొవిడ్​-19 కారణంగా ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించిన బిర్లా.. పార్లమెంటు సమావేశాలు సకాలంలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సాధారణంగా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జూన్​ చివరి వారం లేదా జులై మొదటి వారంలో నిర్వహిస్తారు. గతేడాది జూన్​ 20- ఆగస్టు 7 మధ్య మాన్సూన్​ సెషన్​ జరిగింది.

ఆ నిబంధన ఉంటే...?

జూన్​-జులైలోనూ భౌతిక దూరం నిబంధనలు కఠినంగానే అమలు చేయాల్సి వస్తే సమావేశాలు సాధ్యమేనా అన్న ప్రశ్నకు.. ఆ సమయం వచ్చినప్పుడు వేరే మార్గం వెతకవచ్చని బదులిచ్చారు సభాపతి.

లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూం ఇనిషియేటివ్​ విజయవంతం అయిందని వ్యాఖ్యానించారు. కరోనా లాక్​డౌన్​ సమయంలో... పార్టీలకు అతీతంగా ఎంపీలు ప్రజలకు విశేష సేవలు చేస్తున్నారని బిర్లా ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.