ETV Bharat / bharat

కరోనాపై మీ 'సమాచారం' నిఖార్సైనదేనా! - నకిలీ పోస్టులు

ఇప్పుడు ఫోన్‌ తెరిస్తే చాలు.. సామాజిక మాధ్యమాల్లో కరోనాపై కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపిస్తున్నాయి. గాలి కబుర్లన్నీ పోగేసి.. పాత ఫొటోలు, వీడియోలన్నీ జతచేసి మరీ తప్పుడు సమాచారం గుప్పించేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. లెక్కకు మిక్కిలిగా వస్తున్న తప్పుడు సమాచార ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ఎలా? ప్రజలు ఎలా జాగ్రత్త పడాలి?

mis information
కుప్పలు తెప్పలుగా తప్పుుడు ప్రచారం
author img

By

Published : Mar 29, 2020, 6:52 AM IST

నిజం గడప దాటకముందే.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు. కరోనా మహమ్మారి విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, బోగస్‌ ఫొటోలు, వీడియోలు పలు సామాజిక మాధ్యమాల్లో పోటెత్తుతున్నాయి. ఏది వాస్తవమో, ఏది వదంతో తెలుసుకోలేని గందరగోళం, భయాందోళనలోకి ప్రజల్ని నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మాత్రమే కాదు.. 'సమాచార పరిశుభ్రతా(ఇన్ఫర్మేషన్‌ హైజీన్‌)' ముఖ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు. సమాజానికి హానిచేసే తప్పుడు సమాచారం వ్యాప్తి నిరోధానికి ఏం చేయాలో, దీన్ని ఎలా నియంత్రించాలో సూచిస్తున్నారు.

ఆగండి.. ఆలోచించండి..

కరోనాపై సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారం తెలిస్తే దాన్ని వెన్వెంటనే ఆత్మీయులకు చేరవేయాలన్న ఆతృత వద్దు. నిదానంగా ఆలోచించాలి. అది సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. అవసరమైతే ఇతరులకు పంపే ముందు అది ఎక్కడినుంచి వచ్చిందో రూఢి చేసుకోవాలి.

సందేహాలు తీర్చుకోండి..

మీకు వచ్చిన సమాచారంపై సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకోవాలి. ఇందుకోసం విశ్వసనీయ వార్తా పత్రికలు, ప్రసారమాధ్యమాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్లు, అమెరికాలోని సీడీసీ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు అందించే సమాచారాన్నే విశ్వసించాలి.

నకిలీ పోస్టులతో జాగ్రత్త

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాలు, ప్రఖ్యాత సంస్థలు, ప్రముఖుల ఖాతాలను పోలినట్లుగా కొన్ని నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు పోస్టులు, వీడియోలు, లింక్‌లు రావొచ్చు. అలాంటప్పుడు సంబంధిత అసలు వెబ్‌సైట్లు, ఖాతాలను చెక్‌ చేయాలి.

ఇవిగో ఉదాహరణలు

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రి వైద్యుడు చెప్పారంటూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఓ వాయిస్‌ మెసేజ్‌ వైరల్‌ అయింది. తీరా అదంతా తప్పని ఆ ఆస్పత్రి యాజమాన్యమే ప్రకటన చేసింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరుతో మరో సందేశం చక్కర్లు కొట్టింది. ఇది పూర్తిగా తప్పని ఆయన ఖండించారు.

ఇదంతా తప్పుడు సమాచారమే..

  • ఇటలీలో ఓ జైలు నుంచి 50 మంది ఖైదీలు తప్పించుకు పారిపోయారని, వారి కోసం గాలిస్తూ ఒక నగరంలో సైనిక ట్యాంకులు మోహరించినట్లు సోషల్‌ మీడియాలో ఫొటోతో సహా వచ్చింది. దీన్ని 2.5 లక్షలకు పైగా వీక్షకులు చూశారు. వాస్తవమేమంటే ఆ ఫొటో వేరే నగరంలోనిది. అక్కడ సైనిక విన్యాసాల్లో భాగంగానే ట్యాంకులు తిరిగినట్లు సైన్యం తర్వాత స్పష్టంచేసింది.
  • పుల్లని ఓ పండు రసం తాగితే కరోనా తగ్గిపోతుందంటూ చైనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఒకరు చెప్పినట్లు ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటంటే అసలు ఆ పేరున్న విశ్వవిద్యాలయం చైనాలో లేదు.
  • కెన్యాలో 66 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం చెప్పినట్లుగా ఓ ప్రకటన కొన్ని రోజుల కిందట వైరల్‌ అయింది. అప్పటికి కెన్యాలో ఒక్క కేసూ నమోదు కాలేదు. మార్చి 28 (శనివారం) నాటికి కూడా ఈ దేశంలో 31 కేసులే నమోదయ్యాయి.
  • కరోనా నివారణకు రష్యాలో రోడ్లపైకి సింహాలను వదిలారని, మరో దేశంలో కరోనాతో చనిపోయిన వారిని గుట్టలు గుట్టలుగా పడేస్తున్నారని, నకిలీ ఫొటోలు, వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు.
  • ఓ దేశంలో ప్రజలు నిరసన చేస్తూ రోడ్డుపై పడుకుని ఉన్న ఫొటోను పెట్టి.. జనాలు కరోనాతో పిట్టల్లా రాలిపోయి చనిపోతున్నారని తప్పుడు సమాచారం పెట్టారు.
  • ఇటలీలోనే కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చినట్లు కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ప్రతి ఇంటికి, దుకాణాలకు కూడా దీన్ని సరఫరా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఇంతవరకు కరోనాకు వ్యాక్సిన్‌ గానీ, మందుగానీ రాలేదు.

భావోద్వేగాలతో ఆడుకోవద్దు..

కరోనాపై మనకు భయం, ఆందోళన, కోపం.. ఒక్కోసారి ఆనందం కలిగించే పోస్టులూ వస్తుంటాయి. కొందరు కావాలనే ఏవేవో సంబంధం లేని ఫోటోలు పెట్టి.. ఇప్పటివిగా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ ప్రమాదకరమే. చాలా వరకు తప్పుడు సమాచారం భయపెట్టేదిగా ఉంటుంది. 'వెంటనే ఇలా చేయండి.. అలా చేయండి' అంటూ కొన్ని టిప్స్‌లాగానూ పంపిస్తుంటారు. కానీ ఇది ప్రమాదకరమని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజమా? నమ్మకమా?

మీరు పంపుతున్న సమాచారం నిజమని మీకు తెలుసా? లేదా దాన్ని నమ్ముతూ పంపిస్తున్నారా? అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతిదీ నమ్ముతున్నామంటే మనం దుర్బల స్థితిలో ఉన్నట్లే. ప్రతీదీ నిజమని నమ్మకూడదు. ఎవరికి వారే ఇది కచ్చితమైన సమాచారం అని నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు పంపించడం, ఫార్వర్డ్‌ చేయడం వల్ల దుష్ప్రచారాన్ని ఆపేయవచ్చు.

ఇదీ చదవండి: కరోనాను అడ్డుకోవాలంటే.. ఆ పని 'చేయి'కు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.