ETV Bharat / bharat

చికెన్​ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది! - తమిళనాడులోని కోయంబత్తూర్

తాను బిర్యానీ తినేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారని ఆసుపత్రి అద్దాలు పగలగొట్టాడు ఓ కరోనా రోగి. కోయంబత్తూర్​లోని ఈఎస్​ఐ హాస్పిటల్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Denied chicken biryani, corona patient breaks hospital panes
చికెన్​ బిర్యానీ పెట్టలేదని కోపంతో రగిలిపోయిన కరోనా రోగి
author img

By

Published : Apr 12, 2020, 5:49 AM IST

తమిళనాడులోని కోయంబత్తూర్​లో ఓ కరోనా రోగి కలకలం సృష్టించాడు. తాను బిర్యానీ తినేందుకు వైద్య సిబ్బంది అనుమతివ్వలేదని కోపంతో ఊగిపోయాడు. అదే ఆవేశంలో ఆసుపత్రి కిటికీ అద్దాలు పగలగొట్టాడు. హాస్పిటల్​ సిబ్బంది ఫిర్యాదు మేరకు సదరు రోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది

కరోనా పాజిటివ్​గా వచ్చిన ఓ 27 ఏళ్ల వ్యక్తి కోయంబత్తూర్​లోని ఈఎస్​ఐ ఆసుపత్రిలోని నిర్బంధ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అయితే తనకు బిర్యానీ తినాలని ఉందని భార్యకు చెప్పి.. ఇంటినుంచి తయారుచేసుకుని రమ్మన్నాడు. అతని భార్య స్వయంగా చేసి తీసుకొచ్చినా.. సదరు రోగి బిర్యానీ తినేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన కరోనా రోగి.. ఐసోలేషన్​ వార్డులోని కిటికిపై దాడి చేశాడు. అద్దాలు పగలగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.