ETV Bharat / bharat

'నోట్ల రద్దుతో మోదీ మిత్రులకే మేలు'

నాలుగేళ్ల క్రితం చేపట్టిన నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రధాని మోదీ మిత్రులైన కొంత మంది పెట్టుబడిదారులకే అది సహాయపడిందన్నారు. నోట్ల రద్దు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశారు రాహుల్.

Rahul gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ
author img

By

Published : Nov 8, 2020, 3:28 PM IST

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పెట్టుబడిదారులైన కొంతమంది మిత్రులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల క్రితం ఆ నిర్ణయం తీసుకున్నారని, అది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.

నోట్ల రద్దు చేపట్టిన రోజును విద్రోహ దినంగా పాటిస్తోంది కాంగ్రెస్​. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన.. 'నోట్ల రద్దు సంక్షోభానికి వ్యతిరేకంగా గళం విప్పాలి' అనే కార్యక్రమంలో భాగంగా ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశారు రాహుల్​ గాంధీ.

  • नोटबंदी PM की सोची समझी चाल थी ताकि आम जनता के पैसे से ‘मोदी-मित्र’ पूँजीपतियों का लाखों करोड़ रुपय क़र्ज़ माफ़ किया जा सके।

    ग़लतफ़हमी में मत रहिए- ग़लती हुई नहीं, जानबूझकर की गयी थी।

    इस राष्ट्रीय त्रासदी के चार साल पर आप भी अपनी आवाज़ बुलंद कीजिए। #SpeakUpAgainstDeMoDisaster pic.twitter.com/WIcAqXWBqA

    — Rahul Gandhi (@RahulGandhi) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఆర్థిక వ్యవస్థ క్షీణతకు ప్రభుత్వం కొవిడ్​ను కారణంగా చూపుతోంది. అదే కారణమైతే.. బంగ్లాదేశ్​తో పాటు ప్రపంచం మొత్తం కరోనా ఉంది. కరోనా కారణం కానేకాదు. కేవలం నోట్ల రద్దు, జీఎస్టీలే ప్రధాన కారణం. భారత ఆర్థిక వ్యవస్థపై దాడి చేయటాన్ని ప్రధాని మోదీ నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీశారు. ఆర్థిక వ్యవస్థ 2 శాతం క్షీణిస్తుందని గతంలోనే మన్మోహన్​ సింగ్​ చెప్పారు. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. నోట్ల రద్దు అనేది దేశంలోని నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకని ప్రధాని చెప్పారు. కానీ, దాని ఉద్దేశం అది కాదు. ప్రజల నుంచి డబ్బును తీసుకుని కేవలం 2-3 మంది పెట్టుబడిదారులైన మిత్రులకు ఇవ్వడమే అసలు లక్ష్యం. నగదు కోసం సామాన్యులే క్యూలో నిలుచున్నారు కానీ, పెట్టుబడిదారీ మిత్రులు కాదు. మీరు బ్యాంకులో వేసే సొమ్మును, ప్రధాని మోదీ తన స్నేహితులకు ఇచ్చారు. సుమారు రూ.3,50,000 కోట్ల రుణాలు మాఫీ చేశారు. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

లోపభూయిష్ట జీఎస్టీ విధానాన్ని మోదీ అమలు చేశారని, దాంతో చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు రాహుల్​. జీఎస్టీ ద్వారా తన మిత్రులకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు రైతుల జీవితాలను నాశనం చేయాలనే లక్ష్యంగా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు.

2016, నవంబర్​ 8న రూ.500, రూ.1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఇదీ చూడండి: 'నిరుద్యోగం గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.