ETV Bharat / bharat

ఆ 2 రోజుల్ని ట్రంప్​ ఎప్పటికీ మర్చిపోలేరు: మోదీ - ట్రంప్ భారత పర్యటనకు మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ భారత పర్యటన పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ దంపతులకు భారత్ చిరస్మరణీయమైన స్వాగతం పలుకుతుందని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Delighted that US prez will be in India, will accord him memorable welcome: PM
'భారత్ మీకు చిరస్మరణీయ స్వాగతం పలుకుతుంది'
author img

By

Published : Feb 12, 2020, 2:20 PM IST

Updated : Mar 1, 2020, 2:14 AM IST

ఈనెల 24న రెండు రోజుల భారత పర్యటనకు విచ్చేయనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు భారత్ చిరస్మరణీయమైన స్వాగతం పలుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ట్రంప్ దంపతులు భారత పర్యటనకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్‌లో వెల్లడించారు.

"ప్రజాస్వామ్యం, బహుళత్వం విషయాలలో భారత్‌, అమెరికా ఒకటే సంకల్పంతో పని చేస్తున్నాయి. విస్తృత స్థాయి అంశాలపై రెండు దేశాలు గొప్పగా సహకారం అందించుకుంటున్నాయి. మన రెండు దేశాల మధ్య బలమైన స్నేహం.. ఇరు దేశాలకే కాక ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ట్రంప్‌ భారత పర్యటన చాలా ప్రత్యేకమైనదన్న మోదీ... భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదం చేస్తుందని ఆకాంక్షించారు.

Last Updated : Mar 1, 2020, 2:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.