ETV Bharat / bharat

'23% దిల్లీ వాసుల్లో కొవిడ్‌-19 యాంటీబాడీలు' - Coronavirus study in Delhi

అధిక జన సాంద్రత కలిగిన దేశ రాజధాని దిల్లీలో కరోనా వల్ల 23 శాతం మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని సిరో-ప్రివాలన్స్​ అధ్యయనంలో తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్‌-19 సోకుతున్న వారిలో... ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది.

Delhi's sero-prevalence study finds 23.48 per cent people affected by COVID-19
'23% దిల్లీ వాసుల్లో కొవిడ్‌-19 యాంటీబాడీలు'
author img

By

Published : Jul 21, 2020, 4:15 PM IST

జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం చేపట్టిన సిరో ప్రివాలెన్స్‌ అధ్యయనం ఫలితాలు విస్తుగొలుపుతున్నాయి. పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దిల్లీ నగరంలో ఏకంగా 23 శాతం మంది కొవిడ్‌-19 ప్రభావానికి గురయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దాదాపు 23.48 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. ఊహించిన దానికన్నా తక్కువ మందికే సోకిందని సర్వే నిర్వాహకులు భావిస్తున్నారు.

'మహమ్మారి మొదలై ఆరు నెలలు గడిచినా దిల్లీలో 23.48% మంది మాత్రమే ప్రభావానికి గురయ్యారని సిరో ప్రివాలెన్స్‌ ఫలితాలు తెలియజేస్తున్నాయి. కాగా రాజధాని నగరంలో జన సాంద్రత అత్యధికంగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, కొవిడ్‌-19 పట్ల ప్రజలు అవగాహనతో మెలగడమే ఈ ఫలితాలకు కారణం' అని అధ్యయనం తెలిపింది.

లక్షణాలు లేనివారే అధికం!

దిల్లీలో కొవిడ్‌-19 సోకుతున్న వారిలో ఎక్కువ మంది లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది. అయితే ఇప్పటికీ ముప్పు ముంగిట అనేక మంది ఉన్నారని వెల్లడించింది. ‘ఇంకా ముప్పు పొంచి ఉంది. కాబట్టి వైరస్​ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, తుమ్ము లేదా దగ్గినప్పుడు మోచేతులు అడ్డుపెట్టుకోవడం చేయాలి. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దు’ అని వివరించింది.

జూన్‌ 27 నుంచి జులై 10 వరకు ఈ సర్వే చేయగా 21,000 నమూనాలను సేకరించారు.

ఇదీ చూడండి: బంగాల్​ను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్రంపై దీదీ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.