ETV Bharat / bharat

దిల్లీ తీర్పు: ప్రచారంలో భాజపా జోరు.. ఫలితాల్లో బేజారు

పౌరసత్వంపై రగడ... ఎన్​ఆర్​సీపై ప్రజల్లో భయాలు... ఆర్థిక మందగమనం.. ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య దిల్లీ ఎన్నికల రణరంగంలోకి దిగింది భాజపా. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, కేంద్రంలో తమ ప్రదర్శనను ప్రచారాస్త్రంగా మల్చుకుని ప్రజల్లోకి వెళ్లింది. కేంద్ర మంత్రులతో విస్తృత ప్రచారాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర అధికార పార్టీ ఖాతాలో మరో పరాజయం చేరింది. ప్రచారంలో చూపించిన జోరు.. ఫలితాల్లో కనబర్చలేకపోయింది. ఎందుకిలా?

delhi-result-bjp-tried-aggressive-campaign-but-results-not-favour-to-national-party
దిల్లీ తీర్పు: ప్రచారంలో భాజపా జోరు.. ఫలితాల్లో బేజారు
author img

By

Published : Feb 11, 2020, 3:35 PM IST

Updated : Mar 1, 2020, 12:04 AM IST

దూకుడైన ప్రచారం.. కానీ ఎన్నికల ఫలితాల్లో బోల్తా

దూకుడైన ప్రచారం... ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో విస్తృత ర్యాలీలు... ముఖ్యమంత్రే లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు.. సర్కారు వైఫల్యాలపై ప్రశ్నలు.. ఇదీ దిల్లీ ఎన్నికలకు ముందు భాజపా తీరు. అయితే.. ఇవేమీ ఆ పార్టీని గెలిపించలేదు. లెక్కలు మారినా లక్కు మారలేదు. ఫలితాన్ని పునరావృతం చేసి.. భాజపాకు మళ్లీ షాక్​ ఇచ్చింది ఆమ్​ ఆద్మీ పార్టీ.

దిల్లీలో భాజపా అధికారంలో ఉండి 22 సంవత్సరాలైంది. చివరగా.. 1998లో దివంగత సుష్మాస్వరాజ్​ 52 రోజుల పాటు భాజపా తరఫున దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆ పీఠాన్ని అందుకోలేకపోతోంది కమలదళం.

రోజూ ఐదారు సభలు.. అయినా..

8 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలో ఏడుకు ఏడు పార్లమెంటు స్థానాల్ని గెల్చుకుంది భాజపా. అదే విశ్వాసంతో శాసనసభ ఎన్నికల బరిలోకి దిగింది. ఇటీవలి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటములతో ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారంలో దూకుడు పెంచింది. ప్రముఖ కేంద్ర మంత్రులతో విస్తృత ప్రచారం నిర్వహించింది. హోం మంత్రి అమిత్​ షా.. రోజుకు 5కుపైగా ర్యాలీల్లో పాల్గొని ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. విస్తృతంగా రోడ్​షోలు, బహిరంగ సభలు నిర్వహించి.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు.

ఇంత చేసినా భాజపా ఎందుకు సత్తా చాటలేకపోయింది? దిల్లీ ఎన్నికల్లో ఎందుకు పుంజుకోలేకపోయింది? దిల్లీ ఓటర్లు.. భాజపాను ఎందుకు తిరస్కరించారు? అసలు.. ఆ పార్టీ ఓటమికి కారణాలేంటి?

జాతీయ అంశాలపైనే దృష్టి..

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ఎక్కువగా జాతీయ అంశాలపైనే దృష్టి పెట్టింది. ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్​లో అధికరణ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ) చుట్టూనే ప్రచారం సాగించింది. ముఖ్యంగా దిల్లీ జేఎన్​యూ, జామియా మిలియా వర్సిటీల్లో పౌర అల్లర్లను ప్రస్తావించి ఆప్​, కాంగ్రెస్​ను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

షాహీన్​బాగ్​ నిరసనలు, జాతీయ వాదానికి ముడిపెడుతూ.. ఇవే ప్రధానాస్త్రంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​పై ఆరోపణలూ గుప్పించారు భాజపా నేతలు. ఐదేళ్ల ఆప్​ పాలనపైనా తీవ్ర విమర్శలు చేశారు.

అయితే.. ఆ పార్టీ ఉచ్చులో పడకుండా చాకచక్యంగా వ్యవహరించింది ఆప్​. ఎన్​ఆర్​సీ, సీఏఏ, ఎన్​పీఆర్​ జాతీయ సమస్యలని.. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ప్రచారంలో సంక్షేమ మంత్రానికే ప్రాధాన్యం ఇచ్చింది.

బలమైన నాయకుడు..?

2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజన విజయం సాధించింది భాజపా. కొన్ని నెలలకే.... 2015లో జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. 70 స్థానాల్లో కేవలం మూడంటే మూడు సీట్లు మాత్రమే దక్కించుకుంది. అంతటి ఘోర పరాజయం తర్వాత దిల్లీలో తిరిగి పుంజుకోవడంపై కమలదళం ప్రత్యేక దృష్టిసారిస్తుందని అందరూ ఊహిస్తారు. కానీ... భాజపా స్థానికంగా పెద్దగా కేడర్​ను బలోపేతం చేసుకోలేకపోయింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థినీ ప్రకటించలేదు. మోదీ లాంటి నేత.. భాజపాలో మరొకరు కనిపించలేదు దిల్లీ ఓటర్లకు.

కేంద్ర పాలిత ప్రాంతం, దేశ రాజధానిగా ఉన్న దిల్లీలో పలు కీలకాంశాల్లో అధికారం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారని.. పలుమార్లు కేజ్రీవాల్​ ఆరోపించారు కూడా. ఇదే సమయంలో.. దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తీసుకురావాలని ఉద్యమం మొదలుపెట్టారు. అయితే.. దీనిపైనా స్పష్టతనివ్వలేదు భాజపా.

దిల్లీ వాసుల మనసుల్లో ఏముందో గ్రహించలేకపోయింది భాజపా. ఆప్​ ఐదేళ్ల పాలన, ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇలా ఓ రకంగా 'నెగెటివ్ ప్రచారం' సాగించిన కమలదళం... రాజధాని అభివృద్ధి విషయంలో ఓటర్లకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోయింది.

పరిస్థితులు అన్నింటినీ నిశితంగా పరిశీలించిన దిల్లీ ఓటర్లు.. ఆప్​కే మరోమారు పట్టంకట్టారు. 2015తో పోల్చితే భాజపాకు వచ్చిన సీట్ల సంఖ్య పెరగడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశం.

Last Updated : Mar 1, 2020, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.