ETV Bharat / bharat

దిల్లీ తీర్పు: 'పక్కా లోకల్​' స్కెచ్​తోనే 'ఆప్'​ సినిమా హిట్​ - Delhi election results live

'పౌరసత్వం' ప్రభావం చూపలేదు. 'జాతీయవాదం' పనిచేయలేదు. 'మోదీ-షా' చాణక్యంతో లాభంలేదు. మరోమారు ఏకపక్షంగా తీర్పునిచ్చింది దిల్లీ ఓటరుగణం. ఆమ్​ఆద్మీ పార్టీకే జైకొట్టింది. ఐదేళ్లుగా సాగుతున్న సంక్షేమ-ప్రగతి యజ్ఞాన్ని కొనసాగించాలంటూ అరవింద్ కేజ్రీవాల్​కే మళ్లీ పట్టం కట్టింది. 'సామాన్యుడి పార్టీ' అసామాన్య విజయం ఎలా సాధ్యమైంది? ఎన్నికల రాజకీయంలో కాకలు తీరిన కమలదళ వ్యూహాల్ని ఆప్​ ఎలా ఎదుర్కొంది?

delhi-result-aam-aadmi-hit-with-pakka-local-sketch
దిల్లీ తీర్పు: 'పక్కా లోకల్​' స్కెచ్​తోనే 'ఆప్'​ సినిమా హిట్​
author img

By

Published : Feb 11, 2020, 3:09 PM IST

Updated : Feb 29, 2020, 11:56 PM IST

లోకల్​ స్కెచ్​తోనే 'ఆప్'​ సినిమా హిట్​

పౌరసత్వంపై దేశవ్యాప్తంగా రగడ. దిల్లీలో అయితే మరీ ఎక్కువ. జేఎన్​యూ, జామియా మిలియా విశ్వవిద్యాలయాలతో పాటూ షాహీన్​బాగ్​లో నిరసనలు తీవ్ర విధ్వంసానికి కారణమయ్యాయి. ఇవే హస్తిన అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయనుకున్నారంతా. అయితే.. పరిస్థితులు మారినా అదే ఫలితం. దిల్లీ ఓటర్లు మరోసారి 'స్థానికం'వైపే మొగ్గుచూపారు. ఆప్​ను అందలమెక్కించారు.

భాజపా జాతీయవాదం పనిచేయలేదు. పౌర నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన కాంగ్రెస్​ను పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన 'చీపురు పార్టీ'పైనే నమ్మకముంచారు దిల్లీవాసులు.

అయితే.. ఆప్​ విజయానికి కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా అనేక అంశాలు కళ్ల ముందు మెదులుతాయి. స్థానిక సమస్యలపైనే కేజ్రీవాల్​ సేన దృష్టి పెట్టడం వీటిలో ప్రధానం.

స్థానిక సమస్యలు...

ఎన్నికల విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు దిల్లీ ఓటర్లు. స్థానిక, జాతీయ స్థాయి అంశాల మధ్య వ్యత్యాసం చూపిస్తుంటారు. ఓ రకంగా... 'కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేజ్రీవాల్​' అనే సూత్రాన్ని అవలంబిస్తుంటారు. శాసనసభ ఎన్నికల వేళ పార్టీ వ్యూహాలన్నీ స్థానిక సమస్యలపైనే కేంద్రీకృతం చేసిన ఆప్​కు ఇదే కలిసొచ్చింది.

ఐదేళ్ల పాలన, ఉచిత హామీలు..

అభివృద్ధి... రాజకీయాల్లో ఎంతో శక్తిమంతమైన హామీ. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకోగల వాగ్దానం. అదే ఎన్నికల మేనిఫెస్టోలే చేర్చి విస్తృత ప్రచారం నిర్వహించింది ఆప్.​ 'ఐదేళ్లు అద్భుతంగా సాగాయి. కేజ్రీవాల్‌కు మరోమారు అధికారం ఇచ్చి దాన్ని కొనసాగించండి (అచ్చే బీతె పాంచ్‌ సాల్‌. లగే రహో కేజ్రీవాల్‌)' నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ ఐదేళ్లలో అభివృద్ధి పథకాలెన్నో తీసుకొచ్చింది​. మహిళా భద్రతకు పెద్ద పీట వేసింది. 2015 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరెన్నో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టింది ఆప్​ సర్కార్​.

మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పానిక్​ బటన్స్​, జీపీఎస్​ వ్యవస్థ ఏర్పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత్​ విద్యుత్​, వైద్య, విద్య వంటి రంగాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆప్​ను ప్రజలకు దగ్గర చేశాయి.

మేనిఫెస్టోలో ఇంకెన్నో....

నాణ్యమైన విద్య, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల విద్యుత్​ సహా కీలకాంశాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది ఆప్​. ఇంటివద్దకే రేషన్​, 10 లక్షల మంది వృద్ధులకు ఉచిత తీర్థయాత్రల సౌకర్యం, విధి నిర్వహణలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం కృషి వంటి వాగ్దానాలు చేసింది. వీటిపై నమ్మకముంచే ఆప్​ను మరోమారు గెలిపించారు హస్తిన ఓటర్లు.

భాజపా ఉచ్చుకు దూరం...

పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళనలకు కేంద్రంగా ఉన్న దిల్లీ పరిస్థితుల్ని.. తమ వైపు తిప్పుకోవాలని అనుకుంది భాజపా. షాహీన్​బాగ్​ నిరసనల వెనుక ఆప్​ ఉందని ప్రచారం చేసింది. అయితే.. ఆ వ్యూహంలో చిక్కుకోకుండా... నిరసనలకు ఆమడ దూరంలో ఉంది ఆమ్​ ఆద్మీ. స్థానిక సమస్యలపైనే దృష్టి సారించి చాకచక్యంగా వ్యవహరించింది. అదే ఆప్​కు విజయాన్ని కట్టబెట్టింది.

హ్యాట్రిక్​ విజయం

2012లో ఆమ్​ ఆద్మీ పార్టీని స్థాపించి.. 2013 దిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు కేజ్రీవాల్​. ఆ ఎన్నికల్లో భాజపాకు గట్టిపోటీనిచ్చి.. కాంగ్రెస్​ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆప్​. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు అరవింద్​ కేజ్రీవాల్​.
2015లో ఏకంగా 70కి 67 స్థానాలు గెల్చుకొని జాతీయ పార్టీల ఊసే లేకుండా చేసింది ఆప్​. రెండో సారి సీఎంగా ఎన్నికయ్యారు కేజ్రీ.

ఇప్పుడూ అదే ఫలితం. క్రితంతో పోలిస్తే కొన్ని స్థానాలు తగ్గినా సర్కార్​ ఆమ్​ ఆద్మీదే. హ్యాట్రిక్​ విజయాలతో మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు ఆప్​ అధినేత.

Last Updated : Feb 29, 2020, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.