ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: రెండు భావజాలాల మధ్యే యుద్ధం!

author img

By

Published : Feb 6, 2020, 4:48 PM IST

Updated : Feb 29, 2020, 10:17 AM IST

ఆప్​, భాజపా... దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. ఎప్పటిలానే 'సామాన్యుడి సంక్షేమం' మంత్రాన్ని జపించింది ఆప్​. ఐదేళ్ల ప్రగతిని చూసి ఓటేయాలంటూ ప్రచారం సాగించింది. భాజపా మాత్రం జాతీయవాదాన్నే నమ్ముకుంది. షహీన్​బాగ్​ నిరసనలను పదేపదే ప్రస్తావిస్తూ కేజ్రీవాల్​ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. ఇంతకీ... ఈ 'జాతీయవాద' వ్యూహం అమలులో భాజపా ఎంతమేర సఫలమైంది? కమలదళం ఉచ్చులో చిక్కకుండా ఆప్​ ఎలా జాగ్రత్తపడింది? దిల్లీ దంగల్​లో విజయం ఎవరిది?

delhi-polls-a-battle-between-two-ideologies
దిల్లీ దంగల్​: రెండు భావజాలాల మధ్యే యుద్ధం!

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​పై తిరుగులేని విజయంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపాకు ఎదురేలేదనుకున్నారు. అనంతరం.. సునాయాసంగానే దిల్లీ పీఠం దక్కించుకుంటుందని భావించారు. 2013లో కాంగ్రెస్​ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్​.. తిరిగి రేసులోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో భారీ మద్దతు కూడగట్టుకుని భాజపాకు భారీ షాకిచ్చింది. 2015 ఎన్నికల్లో ఏకంగా 70కి గానూ 67 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అవినీతిపై పోరాటం సహా.. 'దిల్లీ వాసుల సంక్షేమమే ప్రాధాన్యం' హామీతోనే గెలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే.. భాజపా మద్దతుదారులను తనవైపు తిప్పుకోవడంలో అప్పట్లో కేజ్రీవాల్​ తన చతురతను ఉపయోగించారు. దిల్లీలో ఆప్​కు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన జాతీయ పార్టీ భాజపాపై విధేయత చూపించనట్లు కాదన్న భావన వారిలో కలిగేలా చేశారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కేజ్రీవాల్​, ఆయన మద్దతుదారులు కేంద్రంలో మోదీకి, స్థానికంగా తమకు ఓట్లు కోరుతూ లక్షలాది మెయిళ్లు, వాట్సాప్​ సందేశాలు చేరవేశారు.

దూకుడుగా...

2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం భాజపా దూకుడుగా ముందుకెళ్లింది. "సైద్ధాంతిక నాస్తికుడు"గా కేజ్రీవాల్​పై ఉన్న ముద్రను తొలగించే ప్రయత్నం చేసింది. ఒకానొక దశలో కేజ్రీవాల్​ను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భాజపా. ఆ వ్యాఖ్యల పట్ల విచారించనూ లేదు. కేజ్రీవాల్​​ ప్రతిష్ఠను దెబ్బతీసేలా.. దిల్లీ షహీన్​బాగ్​ నిరసనల్ని ప్రస్తావించారు భాజపా నేతలు. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని ఆరోపించారు.

ఆప్​ వైపు మళ్లిన తమ ఓటర్లను తిరిగి సంపాదించుకోవాలని కోరుకుంటోంది భాజపా. కేజ్రీవాల్​ రాజకీయాలు, ప్రాధాన్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారికి గుర్తు చేస్తోంది.

ధీమాగా కేజ్రీవాల్​...

ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ మాత్రం తమ అభివృద్ధి సంక్షేమాలే ఆప్​ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలైన విద్యుత్తు, తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో తమ పనితీరే ఎన్నికల్లో గెలుపునకు దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నారు. మైనార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్​ ఫార్ములానే అవలంబించాలని చూస్తోంది ఆప్​.

ద్విముఖ పోరేనా...!

2015లా కాకుండా.. భాజపాకు ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఆమ్​ ఆద్మీ పార్టీనే. ప్రచారాల్లోనూ పెద్దగా కాంగ్రెస్​ను ప్రస్తావించట్లేదు. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే అని చెప్పొచ్చు. అయితే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశ్వసనీయ ప్రదర్శన చేసిన కాంగ్రెస్​ నామమాత్రంగానే పోటీలో ఉంది.

55 రోజులుగా పౌరచట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు, జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​), జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)ను కేంద్రం తీసుకొస్తుందన్న భయాలు.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.

చీల్చే ప్రయత్నంలో​..

భాజపా, ఆప్​కు పోటీ ఇవ్వగలమని కాంగ్రెస్​ నమ్ముతోంది. ఆ పార్టీల ఓట్లను చీల్చి రేసులో నిలవాలని భావిస్తోంది. అయితే.. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కొందరు పార్టీ​ నాయకుల బంధువులు ఆప్​లో చేరి.. టికెట్లు సాధించుకున్నారు. కాంగ్రెస్​ మాజీ ఎంపీ మహాబల్​ మిశ్రా, ఆయన కుమారుడు ఆమ్​ ఆద్మీ తరఫున బరిలో ఉన్నారు. ఈ కారణంగా.. మిశ్రాను పార్టీ బహిష్కరించింది.

స్వీప్​ చేయలేరా..!

దిల్లీ సమరం మొదలైనప్పుడు ఆప్​దే విజయమని అంతా విశ్వసించారు. 2015 స్థాయిలో ప్రభంజనం ఖాయమని అంచనా వేశారు. అయితే... షహీన్​బాగ్​ నిరసనలకు, జాతీయవాదానికి ముడిపెడుతూ భాజపా ప్రచారం ప్రారంభించాక కాస్త లెక్క మారింది. కమలదళం పుంజుకుంది. ఇప్పుడు ఆమ్​ ఆద్మీ పార్టీ విజయం కష్టమేనని కొందరు అంటున్నారు. అయితే... వారు కాంగ్రెస్​ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడంలేదు. కాంగ్రెస్​ ఓట్లు ఆప్​వైపు మళ్లితే కేజ్రీవాల్ సేన గెలుపు ఖాయం కావచ్చు. దిల్లీలోని 70 నియోజకవర్గాల్లో ఆప్​ 59-60 సీట్లు దక్కించుకోవచ్చని ఇటీవల ఓ సర్వే చెప్పడం... ఈ విశ్లేషణకు ఊతమిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.... నరేంద్ర మోదీ, అమిత్​ షాతోపాటు కాంగ్రెస్​ పార్టీకీ పెద్ద దెబ్బే.

- (రచయిత-సంజయ్ కపూర్, సీనియర్ పాత్రికేయుడు)

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: దేశ ప్రజల ఆలోచనలకు అద్దంపట్టే ఎన్నిక!

Last Updated : Feb 29, 2020, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.