ETV Bharat / bharat

దిల్లీ ఫలితాల్లో కానరాని కాంగ్రెస్ - 63 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 63 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయి ఘోరపరాభవాన్ని చవిచూసింది కాంగ్రెస్​ పార్టీ. 66 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్​కు మూడు స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దిల్లీ పీసీసీ​ అధ్యక్షుడు సుభాష్​​ చోప్రా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.​

Delhi polls: 63 Congress candidates lose deposits
63 స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు!
author img

By

Published : Feb 12, 2020, 5:35 AM IST

Updated : Mar 1, 2020, 1:16 AM IST

దిల్లీ ఫలితాల్లో కానరాని కాంగ్రెస్

ఒకప్పుడు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలతో చక్రం తిప్పిన కాంగ్రెస్​ పార్టీ తాజా ఫలితాల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. అంతేకాదు.. కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయింది. మొత్తం పోలైన ఓట్ల​లో కాంగ్రెస్​కు ఐదుశాతం కంటే తక్కువే వచ్చాయి. 63 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు.

ముగ్గురు మాత్రమే..

అర్వీందర్​ సింగ్​(19.66శాతం), దేవేందర్ యాదవ్(19.14)​, అభిషేక్​ దత్(21.42)​ మాత్రమే డిపాజిట్లు నిలబెట్టుకున్నారు. దిల్లీ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు సుభాష్​​ చోప్రా కుమార్తె శివానీ చోప్రా, దిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్​ యోగానంద శాస్త్రి కుమార్తె ప్రియాంక సింగ్​, మాజీ క్రికెటర్​ కీర్తి ఆజాద్​ సతీమణి పూనం ఆజాద్​ డిపాజిట్లు కోల్పోయిన ప్రముఖులు.

అంచనాలు తారుమారు!

పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మైనారిటీ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో గెలుపు తమదేననే విశ్వాసంతో బరిలోకి దిగింది కాంగ్రెస్​. అయితే గెలుస్తామని ఆశించిన స్థానాల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతికూల ఫలితాలు మూటగట్టుకుంటుండగా.. లోక్​సభ ఎన్నికల్లో పర్వాలేదనిపిస్తోంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 9.7 శాతం ఓట్లు రాగా తాజా ఫలితాల్లో 4.27 ఓట్లు సాధించి చతికలపడింది కాంగ్రెస్. అయితే 2019 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మోస్తరుగా 22.46 శాతం ఓట్లు రావడం గమనార్హం.

''సత్వర నిర్ణయాలు, సరైన వ్యూహ రచన లేకపోవడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయకపోవడం, అందరిని సమన్వయపరచడానికి సరైన నాయకులు లేకపోవడం కారణంగా దిల్లీలో మా పార్టీకి రెండోసారి ఓటమి ఎదురైంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది.''

-షర్మిష్ఠ ముఖర్జీ, దిల్లీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు

ప్రచారంలో వెనకబడిన ముఖ్యనేతలు

సీనియర్​ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందే ప్రచారం చేశారు. అయితే వారు ఎక్కడ ప్రచారం చేశారో ఆ ప్రాంతాల్లోనూ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

నాటి వైభవం నేడేదీ?

1998లో జరిగిన ఎన్నికల్లో గెలవడం మొదలు.. షీలా దీక్షిత్ నేతృత్వంలో 15 ఏళ్లపాటు దిల్లీని పాలించింది కాంగ్రెస్​. దిల్లీ ప్రజలకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు సఫలం అయిన కారణంగా ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్ష, నిర్భయ ఉదంతంతో 2013 ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఎన్నికల అనంతర పొత్తులో భాగంగా కేజ్రీవాల్​కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది కాంగ్రెస్. అయితే జన్​లోక్​పాల్ బిల్లుకు సహకరించకపోవడం పట్ల కినుక వహించిన కేజ్రీ పదవికి రాజీనామా చేశారు. ఏడాది పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. తాజా ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్​జే​డీ)​తో కలిసి బరిలోకి దిగింది కాంగ్రెస్​. 66 స్థానాల్లో కాంగ్రెస్​ పోటీచేయగా.. ఆర్​జే​డీ 4 స్థానాల్లో పోటీ చేసింది.

అధ్యక్ష పదవికి రాజీనామా

ప్రతిరోజు 20- 21 గంటలు పనిచేశానని, కానీ అలసిపోలేదని.. దిల్లీ కాంగ్రెస్ విభాగం తన పోరాటం కొనసాగిస్తుందన్నారు పీసీసీ అధ్యక్షుడు సుభాష్​​ చోప్రా. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు​. అయితే సుభాష్ రాజీనామా అంశం పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

ఇదీ చదవండి: జీరో ఎఫెక్ట్​: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా

ZCZC
PRI GEN NAT
.BENGALURU MDS16
KA-MLA-SON
Cong MLA's son Mohammed Nalapad Harris drove car that rammed
two-wheeler, auto: Police
Bengaluru, Feb 11 (PTI) A two-wheeler rider broke his
leg while an autorickshaw was damaged when Congress MLA
N A Harris' son Mohammed Nalapad Harris allegedly drove his
high-end car recklessly and rammed into them in the city,
police said on Tuesday.
The incident happened on Sunday.
Mohammed Nalapad Harris is out on bail after remaining
in judicial custody for three months in a case of attempt to
murder related to a midnight brawl in February 2018.
"After gathering adequate evidence, we have come to
know that Mohammed Nalapad Harris was driving the car. We have
decided to serve him a notice.
Once he appears, we will initiate further action,"
additional commissioner of police B R Ravikanthe Gowda told
reporters.
The next day after the accident, a man came to the
police claiming that he was driving the car but evidence
revealed that Nalapad was driving it, Gowda said.
The injured two-wheeler ride has been admitted to
hospital, according to police. PTI GMS
BN
BN
02112114
NNNN
Last Updated : Mar 1, 2020, 1:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.