శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు దిల్లీ పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. దిల్లీ పోలీసు విభాగం 73వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న హోం మంత్రి.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు ప్రదానం చేశారు.
"పోలీసులు దేశంలో శాంతి, సురక్షితమైన వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తారు. పోలీసులు ఎవరికీ శత్రువులు కాదు, అందరి శాంతికి చిహ్నం లాంటివారు, వారు వ్యవస్థకు స్నేహితులు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంయమనం పాటించాలని మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన విషయాన్ని దిల్లీ పోలీసులు అనేక సార్లు పాటించారు. అందుకని వారిని మనం సన్మానించాలి."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
2001లో పార్లమెంటు మీద దాడి సమయంలో అమరులైన అయిదుగురు దిల్లీ పోలీసు సిబ్బందికి, బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌లో వీర మరణం పొందిన ఇన్‌స్పెక్టర్ ఎమ్.సీ.శర్మకు అమిత్ షా నివాళులర్పించారు.
ఇదీ చూడండి: యెమెన్‌లో సౌదీ వైమానిక దాడి.. 31 మంది మృతి