రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూపై సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. సిద్దూతో పాటు ఆ ఘటనతో సంబంధమున్నట్లు భావిస్తున్న జగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గర్జాంత్ సింగ్ల ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష బహుమానం ఇస్తామని తెలిపారు. జజ్బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్లను అరెస్టు చేసేలా సమాచారం ఇచ్చినవారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తామని దిల్లీలో పోలీసులు చెప్పారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ సహా పులువురిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.