2012 నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురు దోషుల్లో ఒకరు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మేరకు దిల్లీ హోం శాఖ మంత్రి సత్యేంద్ర జైన్.... లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు.
దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబర్‌లో ఓ విద్యార్ధినిపై ఆరుగురు యువకులు బస్సులోనే అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. వీరిలో ఐదుగురికి.. కింది కోర్టులు మరణ దండన విధించాయి. ఐదుగురిలో ఒకరు జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. కింది కోర్టులు విధించిన మరణశిక్షను దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్ధించాయి.
ఇదీ చూడండి: 'అయోధ్య కాదు.. విద్య, ఉద్యోగాలపై దృష్టిసారించండి'