ETV Bharat / bharat

విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్​!

author img

By

Published : Feb 29, 2020, 12:20 PM IST

Updated : Mar 2, 2020, 10:55 PM IST

దిల్లీలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో కేజ్రీవాల్​ ప్రభుత్వం అప్రమత్తమైంది. హింసను ప్రేరేపించే సందేశాలను ఎవరైనా పంపిస్తే వారిపై వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేలా వాట్సప్​ హెల్ప్​లైన్​ నంబర్​ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది దీల్లీ సర్కారు.

Delhi govt considering to launch WhatsApp no. for people to complain about hate messages
విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్​

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి ఇలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు వాట్సప్​ హెల్ప్​లైన్​ నంబర్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

విద్వేషపూరిత సందేశాలు ఎవరైనా పంపిస్తే నేరుగా ఆ వాట్సప్​ నంబర్​కు ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో పుకార్లను అరికట్టేందుకే ఈ వాట్సప్​ నంబర్​ను తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరలో నంబర్​ను ప్రకటిస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Last Updated : Mar 2, 2020, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.