ETV Bharat / bharat

దిల్లీలో కరోనా టీకా నమోదు ప్రక్రియ షురూ

కొవిడ్-19 టీకా కోసం నమోదు ప్రక్రియను ఆరంభించింది దిల్లీ ప్రభుత్వం. కరోనావైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి మొదటగా టీకీ ఇవ్వనుంది. సిబ్బంది తమ సమాచారాన్ని పొందుపరిచేందుకు దిల్లీ స్టేట్ హెల్త్ మిషన్‌ వెబ్‌సైట్‌లో ఒక లింక్‌ను ఉంచిందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దానికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను ప్రచురించింది.

Delhi-Government-Begins-Enrolling-Healthcare-Workers-For-Vaccination
దిల్లీలో టీకా నమోదు ప్రక్రియ ఆరంభం
author img

By

Published : Dec 5, 2020, 5:17 AM IST

కరోనావైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తూ.. ప్రాధాన్యక్రమంలో ముందు వరసలో ఉన్న వైద్య సిబ్బందికి కొవిడ్-19 టీకా కోసం నమోదు ప్రక్రియను దిల్లీ ప్రభుత్వం ఆరంభించింది. సిబ్బంది తమ సమాచారాన్ని పొందుపరిచేందుకు దిల్లీ స్టేట్ హెల్త్ మిషన్‌ వెబ్‌సైట్‌లో ఒక లింక్‌ను ఉంచిందని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దానికి సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. దిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వందల మంది వైద్యులు కరోనా సోకినవారికి చికిత్స అందిస్తూ ఆ వైరస్ బారినే పడ్డారు.

'దిల్లీ ప్రభుత్వం వైద్య సిబ్బందికి కొవిడ్-19 టీకాను అందించేందుకు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. నమోదిత‌ నర్సింగ్ హోమ్స్‌, ఆసుపత్రులు ఇప్పటికే తమ సమాచారాన్ని పొందుపరిచాయి. నమోదు కాని వైద్యశాలలూ ఈ వరసలో ఉన్నాయి' అని ఆ నోటిఫికేషన్ వెల్లడించింది. పారామెడికల్ సిబ్బంది, అల్లోపతి, దంత వైద్యులు, ఆయూష్‌‌, ఫిజియోథెరపీ క్లినిక్స్‌, రక్త-మూత్ర పరీక్షశాలలు‌, రేడియాలజీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. కొద్ది వారాల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు వ్యాక్సినేషనల్‌లో తొలిప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి: 'కొవిడ్ టీకాకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.