వాయవ్య దిల్లీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కేశవపురం ప్రాంతంలోని ఓ ఫుట్‌వేర్ తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న 23 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పాయి. ఈ మేరకు దిల్లీ అగ్నిమాపక అధికారులు వివరాలు వెల్లడించారు.
ఆగ్నేయ దిల్లీ ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం
ఆగ్నేయ దిల్లీలో సోమవారం రాత్రి మంటల్లో కాలిపోయిన తాత్కాలిక ఆవాసాల్లోని వారి పునరావాసానికి అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి తుగ్లకాబాద్‌లోని 250 తాత్కాలిక ఆవాసాలకు నిప్పంటుకుంది. మంటలను ఆర్పేందుకు 28 అగ్నిమాపక యంత్రాలు పనిచేశాయి.