దేశమంతటా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తోన్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ సారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే విజయం వరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పటివరకు ఆప్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు... పలు విడతల్లో జరుగుతుందని దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణ్బీర్ సింగ్ తెలిపారు. పలు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈసీ నిర్దేశించిన విధానాల మేరకు ప్రక్రియ కొనసాగుతుందని సింగ్ వివరించారు.
ఫిబ్రవరి 8న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో దిగారు. పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత ఓటింగ్ శాతాన్ని 62.59గా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2015తో పోలిస్తే ఇది 5 శాతం తక్కువ.