వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను మార్చ్ 19 వరకు పొడగిస్తూ దిల్లీ న్యాయస్థానం శనివారం తీర్పునిచ్చింది.
లండన్ ఆధారిత ఆస్తుల్లో హవాలాకు వాద్రా పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 1.9 మిలియన్ పౌండ్ల విలువైన విదేశీ అక్రమ ఆస్తులున్నట్లు చెబుతోంది ఈడీ.