మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాకు ఊరటనిచ్చింది దిల్లీ కోర్టు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. వైద్యం నిమిత్తం ఆరువారాల పాటు అమెరికా, నెదర్లాండ్స్ల్లో పర్యటించేందుకు అంగీకారం తెలిపింది. లండన్ వెళ్లేందుకు మాత్రం అంగీకరించలేదు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికను సమర్పించాలని వాద్రాను ఆదేశించింది.
విదేశీ పర్యటనలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమతి లేకుండా వాద్రా లండన్ వెళ్లరని కోర్టుకు తెలిపారు ఆయన తరఫు న్యాయవాది.
లండన్ వెళ్లాలన్న వాద్రా వినతిని వ్యతిరేకించారు ఈడీ తరఫు న్యాయవాది.
లండన్లో 1.9మిలియన్ పౌండ్లు విలువ చేసే భవానాన్ని వాద్రా అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి.
ఇదీ చూడండి: బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్, స్మృతి