ETV Bharat / bharat

దిల్లీ ప్రజల్లో 'హెర్డ్ ఇమ్యూనిటీ' సూచనలు!

author img

By

Published : Jan 25, 2021, 7:30 PM IST

Updated : Jan 25, 2021, 7:55 PM IST

దిల్లీ జనాభాలో కొవిడ్​ సంక్రమణకు వ్యతిరేకంగా 'హెర్డ్ ఇమ్యూనిటీ' అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం. సెరోలాజికల్ సర్వేలో ఈ విషయం తెలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

herd immunity in Delhi papulation against Covid
దిల్లీ ప్రజల్లో కొవిడ్​కు వ్యతిరేకంగా మంద రోగనిరోధక శక్తి

కరోనా వైరస్​ సంక్రమణకు వ్యతిరేకంగా దిల్లీ జనాభాలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐదో దశ సెరోలాజికల్ సర్వేలో ఈ విషయం తేలిందని వెల్లడించాయి. ఒక జిల్లాలో 50-60 శాతం శాంపిళ్లలో కొవిడ్​ -19కు వ్యతిరేకంగా యాంటీబాడీలను గుర్తించినట్లు వివరించాయి.

గత వారం ముగిసిన ఈ సర్వేలో.. నగరంలోని వివిధ జిల్లాల నుంచి 25 వేల మంది నుంచి శాంపిళ్లు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న దిల్లీ జనాభా 2 కోట్ల పైమాటే.

'హెర్డ్ ఇమ్యూనిటీ' అంటే?

ఏదైనా సమూహంలో ఎవరికైనా వైరస్​ సోకి కోలుకున్న తర్వాత.. చాలా మంది శరీరంలో ఆ వైరస్​కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. వైరస్​కు వ్యతిరేకంగా కావాల్సిన యాంటీబాడీలు అభివృద్ధి చెందడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాంటి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు.. కరోనా వైరస్ సోకిన వారికి, సోకని వారికి మధ్య రక్షణ కవచంలా నిలుస్తారు. దీని ద్వారా కరోనా వైరస్​ సంక్రమణ గొలుసు తెగిపోతుంది. దీనినే 'హెర్డ్ ఇమ్యూనిటీ' అంటారు.

ఇదీ చూడండి:'కరోనా టీకాపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు'

Last Updated : Jan 25, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.