ETV Bharat / bharat

సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్​

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త వ్యవసాయ చట్టాల ప్రతులను చించివేసి నిరసన తెలిపారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. పోరాడుతున్న రైతులకు ద్రోహం చేయలేకనే తాను ఈ పని చేసినట్టు వెల్లడించారు.

Kejriwal tears copies of Centre's farm laws, says cannot betray farmers
సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్​
author img

By

Published : Dec 17, 2020, 7:17 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్‌ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ ప్రతులను చించివేశారు. కేజ్రీతో సహా.. పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలూ ఈ ప్రతులను చించివేసి నిరసన తెలిపారు.

అధికార పార్టీ తీసుకొచ్చిన చట్టాలు.. రైతుల కోసం కాదని, ఎన్నికల సమయంలో ఫండ్స్‌ ఇచ్చే వారి కోసమని కేజ్రీవాల్‌ ఆరోపించారు. 'నేను ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయడం లేదు. రైతులకు ద్రోహం చేయడం ఇష్టం లేకే చేస్తున్నా. చలిగాలుల్లో రోడ్లపై నిద్రిస్తూ హక్కుల కోసం పోరాడుతున్న రైతుల కోసం ఇది చేస్తున్నా.' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు సీఎం.

'నాటి పోరాటాన్ని గుర్తుచేస్కోండి'

ఇప్పటికే 20 మంది రైతులు ఈ పోరాటంలో మరణించారని.. కేంద్రం ఇంకెప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇలానే వదిలేస్తే రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారని కేంద్రం భావిస్తోందని ఆయన చెప్పారు. కానీ, 1907లో బ్రిటీష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. నాటి రైతులు 9 నెలల పాటు పోరాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు కేజ్రీవాల్​.

ఇవీ చదవండి: 'అప్పటివరకు సాగు చట్టాలు నిలిపివేయగలరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.