ETV Bharat / bharat

సీఏఏ అల్లర్లు: 'హోం మంత్రి రాజీనామాకు డిమాండ్​' - 'సీఏఏ ఆందోళనలకు బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలి'

సీఏఏ ఆందోళనలపై పలువురు మృతి చెందడం పట్ల స్పందించింది కాంగ్రెస్ పార్టీ. అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్​ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో హింసాయుత ఆందోళనలను ఖండించింది. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని అనుకునే వారి ఆటలు సాగనివ్వకూడదని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. శాంతియుత నిరసనలే ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ట్రంప్​ రాకను దృష్టిలో పెట్టుకుని కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి.

caa
'పౌర' ఆందోళనలపై కాంగ్రెస్ స్పందన
author img

By

Published : Feb 25, 2020, 5:42 AM IST

Updated : Mar 2, 2020, 11:55 AM IST

దిల్లీలో జరుగుతున్న పౌరచట్ట వ్యతిరేక ఆందోళనల్లో హింసను ఖండించింది కాంగ్రెస్ పార్టీ. అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్​షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆందోళనలను రూపుమాపడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించింది. రాజకీయాల కారణంగా దిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయపడింది.

సంయమనం పాటించాలి: సోనియా

దిల్లీ ప్రజలు సహోదర భావంతో మెలగాలని, హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని అనుకునే వారి ఆటలు సాగనివ్వకూడదని పేర్కొన్నారు.

'హింసాత్మక ఆందోళన వద్దు'

శాంతియుత నిరసన ప్రదర్శనలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచన అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కానీ హింసాత్మక నిరసనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దిల్లీలో హింసాత్మకంగా మారిన నిరసనలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

'సాధారణ ప్రజలపై దెబ్బ'

పౌరచట్ట వ్యతిరేక ఆందోళనల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ. దిల్లీ వాసులు సంయమనం పాటించాలని పేర్కొన్నారు. మహాత్ముడు జీవించిన దేశం శాంతికి ప్రతీకగా ఉండాలని పేర్కొన్నారు ప్రియాంక.

తిప్పికొట్టిన భాజపా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- దిల్లీ పర్యటన సందర్భంగా కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి.

ఈ ఆందోళనలు 2000 సంవత్సరంలో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ పర్యటన సందర్భంగా రేగిన సిక్కు అల్లర్ల వంటివని పేర్కొన్నారు భాజపా అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి.

ఇదీ చూడండి: ట్రంప్​కు మోదీ ఇచ్చిన విలువైన కానుకలు ఇవే

Last Updated : Mar 2, 2020, 11:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.