కాలుష్య నియంత్రణ కోసం వివిధ రకాల చర్యలు చేపడుతోంది దిల్లీ ప్రభుత్వం. ఇటీవలే సచివాలయం వద్ద గ్రీన్ వార్ రూమ్ ప్రారంభించిన దిల్లీ సర్కార్ తాజాగా స్మోగ్ టవర్ ఏర్పాటు, ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అమలుకు సిద్ధం అవుతోంది. వీటికి శుక్రవారం దిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
" కాలుష్య నియంత్రణ కోసం దిల్లీలోని కన్నాట్ వద్ద స్మోగ్ టవర్‌ను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం రూ.20 కోట్లు కేటాయించాం. 10 నెలల్లో ఈ టవర్ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో ఇదే మొదటిది. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పాలసీ ప్రకారం...ఇది వరకు చెట్ల మనుగడను ప్రభావితం చేసిన సంస్థలే 80 శాతం ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీ కోసం ఒక సెల్ ఏర్పాటు చేస్తాం."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి: ఉద్యోగం పోతేనేం.. వీరిలా ఆలోచన ఉంటే చాలదూ!