ETV Bharat / bharat

దిల్లీ పేలుడు కేసు ఎన్​ఐఏకు అప్పగింత! - delhi blast latest news

దిల్లీలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటన విచారణను ఎన్​ఐఏకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై దిల్లీ పోలీసు స్పెషల్ సెల్, దిల్లీ ఫోరెన్సిక్, ఇంటిలిజెన్స్ బ్యూరో ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టాయి. మూడు రోజుల్లో హోం శాఖ ఈ విషయంపై అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

Delhi bomb blast case to be handed over to NIA:sources
దిల్లీ పేలుడు కేసు ఎన్​ఐఏకు అప్పగింత!
author img

By

Published : Jan 30, 2021, 12:29 PM IST

Updated : Jan 30, 2021, 1:41 PM IST

దిల్లీ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు అప్పగించనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే దిల్లీ పోలీసు స్పెషల్ సెల్, దిల్లీ ఫోరెన్సిక్, ఇంటిలిజెన్స్ బ్యూరో దర్యాప్తు మొదలుపెట్టాయి. పేలుడుపై హోం శాఖ వర్గాలు ఆరా తీశాయి. హోం మంత్రి అమిత్ షాకు దిల్లీ పోలీసు కమిషనర్, ఐబీ చీఫ్​​ శుక్రవారం రాత్రి వివరాలు తెలియజేశారు. రాబోయే మూడు రోజుల్లో హోం శాఖ ఈ విషయంపై అధికారికంగా ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద తక్కువ సామర్థ్యంతో పేలుడు సంభవించినట్లు పోలీసు విచారణ బృందం ఇప్పటికే నిర్ధరించింది. దేశంలో ఎటువంటి పేలుడు సంభవించినా ఎన్ఐఏ విచారించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించనున్నట్లు సమాచారం. దిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ బృందం ఇప్పటికే నమోదు చేసిన కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కేసును దర్యాప్తు చేస్తున్న ఇంటిలిజెన్స్ బ్యూరో, స్పెషల్ సెల్ అధికారులతో ఎన్ఐఏ సీనియర్ అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.

2012లో ఇజ్రాయెల్ రాయబార అధికారులపై జరిగిన దాడి కేసు కూడా ఇంకా పెండింగ్​లో ఉండటం వల్ల ఆ కేసు విచారణ కూడా వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.

డోభాల్ పర్యవేక్షణ..

బాంబు పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్​ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పేలుడు వెనుక ఎవరున్నారు, ఇంకా స్పష్టంగా తెలియలేదన్నాయి. ఇరాన్​పై అధికారికంగా కూడా ఆరోపణలు చేయలేమని పేర్కొన్నాయి. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే.. మొత్తం వ్యవహారంపై అధికారికంగా కేంద్రం ఒక ప్రకటన చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​పై ప్రతీకారంతోనే దిల్లీలో పేలుడు!

Last Updated : Jan 30, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.