ఐరోపా సమాఖ్యకు చెందిన 23 మంది సభ్యుల బృందం ఇవాళ జమ్ముకశ్మీర్‌లో అనధికార పర్యటన చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులను అంచనావేయడానికి ఈ బృందం వచ్చింది.
రెండు రోజులపాటు ఈ బృందం కశ్మీర్లో పర్యటిస్తుంది. స్థానిక ప్రజలను కలిసి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటుంది. ప్రభుత్వ అధికారులు... లోయతోపాటు జమ్ము కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల స్థితిగతులను ఈయూ ఎంపీలకు వివరిస్తారు.
ఆర్టికల్ 370 రద్దు తరువాత ఓ విదేశీ బృందం జమ్ము కశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి.
27 కాస్తా 23 అయ్యింది..
నిజానికి ఈయూ బృందంలో 27 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది తీవ్ర మితవాదులు లేదా మితవాద పార్టీలకు చెందినవారు. అయితే వీరిలో నలుగురు కశ్మీర్ పర్యటన నుంచి విరమించుకుని తమ స్వదేశాలకు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.
మోదీతో భేటీ
ఈయూ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'జమ్ముకశ్మీర్ సహా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చు' అని ప్రధాని మోదీ.. ఎంపీలకు సూచించారు.
ఇదీ చూడండి: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే