ETV Bharat / bharat

శివుడిపైనా లాక్​డౌన్​ ఎఫెక్ట్- పార్వతి కోసం ఎదురుచూపులు

శివపార్వతులపైనా కరోనా ప్రభావం పడింది. లాక్​డౌన్​ కారణంగా రాజస్థాన్​లోని హదోటి ప్రాంతంలోని శివాలయాల్లో పార్వతి విగ్రహాలు కనిపించడం లేదు. అసలు లాక్​డౌన్​కు, విగ్రహాలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?

LORD SHIVA TEMPLE
శివునికీ లాక్​డౌన్​ ఎఫెక్ట్
author img

By

Published : May 4, 2020, 4:27 PM IST

కరోనా లాక్​డౌన్ ప్రభావంతో దేశమంతా దేవాలయాలు మూతబడ్డాయి. రాజస్థాన్​ హదోటి ప్రాంతంలోని శివాలయాలు మాత్రం పార్వతి విగ్రహాలు లేక వెలవెలబోతున్నాయి. అక్కడ ఈ పరిస్థితి నెలకొనడానికి లాక్​డౌనే కారణం.

అనాదిగా వస్తోన్న సంప్రదాయం..

"ఈ ప్రాంతంలో వందల ఏళ్లుగా ఒక ఆచారం ఉంది. పెళ్లి కాని యువకులు ఇక్కడి శివాలయాల్లోని పార్వతి విగ్రహాలను ఎత్తుకెళితే వారికి వివాహం జరుగుతుందని ఇక్కడివారి నమ్మకం. ఇలా వేరు చేయటం వల్ల త్వరగా పెళ్లి జరిగేలా శివుడు ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తారు.

ఇలా అపహరించిన విగ్రహాలను ఇంట్లో పెట్టి యువకులు పూజిస్తారు. తమకు జీవిత భాగస్వామి త్వరగా లభించేలా శివుడ్ని కోరాలని పార్వతిని ప్రార్థిస్తారు. పెళ్లి జరిగిన తర్వాత.. ఆ విగ్రహాన్ని యథాస్థితిలో తీసుకువచ్చి అన్ని లాంఛనాలతో పునఃప్రతిష్ట చేస్తారు" అని వివరించారు పరాశర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

అనేక నెలలుగా..

లాక్​డౌన్ నేపథ్యంలో పెళ్లిళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం లేదు. ఫలితంగా పార్వతి విగ్రహాలను తిరిగి తీసుకువచ్చి పెట్టడం లేదు. అందువల్ల చాలా ఆలయాల్లో పార్వతి విగ్రహాలు లేవని అక్కడి పూజారులు వాపోతున్నారు. అనేక నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

ఆ ప్రాంతంలోని 500 ఏళ్ల చరిత్ర ఉన్న రఘునాథ్​ఘాట్​, ఝరేశ్వర్ మహదేవ్​ ఆలయాల్లోనూ పార్వతి విగ్రహాలు లేవు. అక్షయ తృతీయ వేడుకల్లోనూ పార్వతి విగ్రహాలు లేకుండానే పూజలు నిర్వహించామని చెప్పారు అర్చకులు.

రాజస్థాన్​లో అక్షయ తృతీయను పెళ్లిళ్లకు మంచి రోజుగా భావిస్తారు.

ఫిర్యాదులు ఉండవ్..

పార్వతి విగ్రహాల అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేయమని పరాశర్ తెలిపారు.

"ఈ విగ్రహాలను అపహరిస్తే ఇక్కడ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు. ఎందుకంటే మళ్లీ ఆ విగ్రహాలను తీసుకొచ్చి వాళ్లే పునఃప్రతిష్ట చేస్తారు."

- పరాశర్, ఉపాధ్యాయుడు

ఈ పరిస్థితి గురించి తెలిసినవారు లాక్​డౌన్​తో దేవునికీ తిప్పలు తప్పలేదని పలువురు చమత్కరిస్తున్నారు. శివుడు, పార్వతి మధ్య కరోనా ఎడబాటు పెంచిందని అంటున్నారు.

ఇదీ చూడండి: ఏనుగుల గుంపు బీభత్సం.. మహిళకు తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.