సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వాస్తవాధీన రేఖ సహా సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై అధికారులతో చర్చించారు.
ఈ సమావేశానికి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యం, నావికాదళం, వాయుసేన అధిపతులు సహా.. జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ హాజరయ్యారు. లద్ధాఖ్‌లో.. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, విమానాల మోహరింపు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: ఆ ఐసిస్ ఉగ్రవాది అరెస్టుతో భారీ ఉగ్ర కుట్ర భగ్నం