ప్రపంచంలోనే ఎత్తయిన సైనిక స్థావరం సియాచిన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు సందర్శించనున్నారు. అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించనున్నారు. అనంతరం.. అక్కడ యుద్ధ స్మారకానికి పునాది రాయి వేయనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధభూమి.. సియాచిన్ గ్లేసియర్‌కు వెళ్లి అక్కడి ఫీల్డ్ కమాండర్లు, సైనికులతో మాట్లాడనున్నారు రక్షణ మంత్రి. సైన్యాధిపతి బిపిన్ రావత్, ఇతర రక్షణ శాఖ అధికారులు రాజ్‌నాథ్‌తో పాటు సియాచిన్ వెళ్లనున్నారు.
అనంతరం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకుంటారు రాజ్‌నాథ్. పాకిస్థాన్‌తో భారత సరిహద్దుల వెంట భద్రతా బలగాల పర్యవేక్షణ, పరిస్థితుల గురించి అధికారులు.. మంత్రికి నివేదించనున్నారు. ఉగ్రవ్యతిరేక కార్యకలాపాలపైనా సమీక్ష నిర్వహించనున్నారు కేంద్ర మంత్రి.
శ్వాస తీసుకోవడానికి సైతం కష్టంగా ఉండే ప్రాంతం సియాచిన్. 23 వేల అడుగుల ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి, అక్కడ కొంతమంది సైనికులను మోహరించింది.
ఇదీ చూడండి: 5 నెలల్లో 101 మంది ముష్కరులు హతం