ETV Bharat / bharat

లద్దాఖ్​ పరిస్థితులపై రక్షణ మంత్రి సమీక్ష - china india war

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్..​ తూర్పు లద్దాఖ్​లో పరిస్థితిని సమీక్షించారు. భారత్​-చైనా సరిహద్దులో గత కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం వెతికే దిశగా త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిపారు. మహా దళపతి జనరల్​ బిపిన్​ రావత్​ కూడా హాజరయ్యారు. భారత సైనిక సన్నద్ధతపై ఆరా తీశారు.

Defence Minister Rajnath Singh reviews situation in eastern Ladakh
లద్ధాఖ్​ పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
author img

By

Published : Jul 10, 2020, 4:01 PM IST

తూర్పు లద్ధాఖ్​లో పరిస్థితులపై సమీక్షించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిపిన మంత్రి.. బలగాల ఉపసంహరణ అంశంపై ఆరా తీశారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే, నావికాదళ అధిపతి అడ్మైరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియాలతో పాటు పలువురు సీనియర్ సైనిక అధికారులతో జరిగిన సమావేశంలో సమీక్ష నిర్వహించారు రాజ్​నాథ్​.

తూర్పు లద్ధాఖ్​తో పాటు, అరుణాచల్​ ప్రదేశ్, ఉత్తరాఖండ్​, సిక్కింలలోనూ నియంత్రణ రేఖ వెంటనున్న ప్రాంతాల్లోని పరిస్థితిని.. రక్షణ మంత్రికి వివరించారు ఆర్మీ చీఫ్​. ఆ ప్రాంతాల్లో ఎలాంటి అనివార్య పరిస్థితులు తలెత్తినా.. ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా.. గల్వాన్​, గోగ్రా, హాట్​ స్ప్రింగ్స్​ వంటి వివాదాస్పద ప్రాంతాల్లో 3 కి.మీ. మేర బలగాలు వెనక్కి మరలినట్లు తెలిపారు. అయితే, ఫింగర్​-4, ప్యాంగోంగ్​ ప్రాంతంలోనూ క్రమంగా బలగాలను తగ్గిస్తున్నట్లు తెలిపారు.

లద్ధాఖ్​లో భారత్​-చైనా సైన్యం మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్​ 15న అర్ధరాత్రి గల్వాన్​ లోయ వద్ద తెలెత్తిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం.. ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. దశల వారీగా బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి.

ఇదీ చదవండి: భారత్​- చైనా మధ్య మరోసారి దౌత్య చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.