ETV Bharat / bharat

నేడు సరిహద్దులో కీలక ప్రాజెక్టులకు రాజ్​నాథ్​ శంకుస్థాపన

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ గురువారం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వెల్లడించారు.

Defence Minister likely to inaugurate key border infra projects on Thursday
సరిహద్దుల్లో కీలక ప్రాజెక్టులకు రాజ్​నాథ్​ శంకుస్థాపన!
author img

By

Published : Jul 9, 2020, 7:20 AM IST

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ గురువారం కీలక ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పశ్చిమ సెక్టార్​ సహా వ్యూహాత్మమైన కీలక సరిహద్దు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లోని అనేక వంతెనల నిర్మాణాలకు రాజ్​నాథ్​.. ఆన్​లైన్​ వేదికగా పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం.

చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ దృష్టి పెట్టింది. వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ)ను ఆదేశించింది కేంద్రం. వీటి పురోగతిని సమీక్షించే ఉన్నత స్థాయి కమిటీతో మంగళవారం భేటీ అయ్యారు రాజ్​నాథ్​. ఈ సమావేశంలో లద్దాఖ్​ సహా, వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాల స్థితిగతులపై చర్చించారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్​: షూటింగ్​లకు త్వరలోనే మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.