ETV Bharat / bharat

పాకిస్థాన్​ను కాపాడేశక్తి ఎవరికీ లేదు: రాజ్​నాథ్​ - పాకిస్థాన్​ హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం పాకిస్థాన్​ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వైఖరి మార్చుకోకుంటే పాక్​ ముక్కలుకాక తప్పదని హెచ్చరించారు. తీవ్రవాదులు, వారి సంస్థలను పాక్​ ప్రభుత్వం నిర్వీర్వం చేయాలని సూచించారు. లేకపోతే పాక్​ను కాపాడేశక్తి ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు.

పాక్​ను కాపాడే శక్తి ఎవరికీ లేదు: రాజ్​నాథ్​
author img

By

Published : Oct 13, 2019, 6:01 PM IST

పాకిస్థాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. ఇప్పటికే రెండు ముక్కలైన పాకిస్థాన్.. వైఖరి మార్చుకోకుంటే మరిన్ని ముక్కలుకాక తప్పదని హెచ్చరించారు.

హరియాణా పటౌడీలో పర్యటించిన సందర్భంగా పాకిస్థాన్​పై మండిపడ్డారు రాజ్‌నాథ్‌. అధికరణ 370 రద్దు అనంతరం పాక్‌ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. పాక్‌ పాలకులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. తీవ్రవాదులు, వారి సంస్థలను నిర్వీర్యం చేయాలని సూచించారు. తీవ్రవాదంపై పాక్‌ నిజాయితీగా పోరాడకుంటే భారత ప్రభుత్వమే..ఆ పనిచేస్తుందన్నారు.

రాజ్​నాథ్​సింగ్

" ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఒక వేళ తీవ్రవాదులను నిర్మూలించేందుకు నిజాయితీగా పనిచేయకూడదని అనుకుంటే.. ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడండి. కానీ, ఉగ్రవాదంపై పోరు చేసేవారితోనే భారత్​ స్నేహం చేస్తుంది. భారత్​పై బలగాలను ప్రయోగించాలనుకుంటే బలగాలతోనే బుద్ధి చెబుతుంది. తీవ్రవాదుల పట్ల మీ వైఖరి మారకుంటే మిమ్మల్ని కాపాడేందుకు ప్రపంచంలో ఎవరికీ ఆ శక్తి ఉండదు. ఇప్పటికే బంగ్లాదేశ్​, పాకిస్థాన్​లుగా రెండు ముక్కలయింది. ముందుముందు 10 ముక్కలు కావచ్చు, 5 కావచ్చు.. ఇంకా ఎన్నైనా కావచ్చు."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

రఫేల్​ ఉండి ఉంటే..

మన దగ్గర రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నట్లయితే బాలాకోట్‌లో వాయుదాడులు జరిగేవే కాదని.. పాకిస్థాన్‌లో అడుగు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు రాజ్​నాథ్​. అక్కడ ఉన్న ఉగ్రమూకలను రఫేల్‌ ద్వారా మనం ఎప్పుడో వెళ్లగొట్టే వాళ్లమని తెలిపారు. భారత్‌లో ఉన్నవాళ్లనూ తరిమికొట్టేవాళ్లమని పేర్కొన్నారు. ఏప్రిల్‌ లేదా మే నెల నాటికి 7 రఫేల్‌ యుద్ధవిమానాలు మనదేశానికి వస్తాయని తెలిపారు.

ఇదీ చూడండి: భాజపా చొక్కా వేసుకుని రైతు ఆత్మహత్య..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  Yokohama Stadium, Yokohama, Japan - 13th October 2019.
1.++FULL SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:44  
SCRIPT:
Japan and Scotland fans were in high spirits as they arrived for their Rugby World Cup Pool A decider in Yokohama on Sunday.
The two side's faced an agonising wait to find out if their final pool game would go ahead, as Typhoon Hagibis struck the country on Saturday.
World Rugby and the Japan Rugby 2019 Organising Committee carried out a comprehensive assessment of the venue and surrounding infrastructure on Sunday morning, deeming the fixture safe to go ahead - much to the delight of rugby fans around the world.
Gregor Townsend's Scotland would have been eliminated from the tournament had the game been cancelled, and now need a bonus point victory to progress.  
Japan are second in the pool behind Ireland, with Jamie Joseph's side are aiming to reach the quarter-finals for the first time.  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.