ETV Bharat / bharat

సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి గ్రీన్ ​సిగ్నల్​

బాలికలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాలల్లో ప్రవేశం కల్పించడానికి రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ అనుమతి మంజూరు చేశారు. ఇందుకోసం సైనిక పాఠశాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, తగినంత మంది మహిళా సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Oct 18, 2019, 11:46 PM IST

సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి రాజ్​నాథ్​సింగ్ అనుమతి

2021-22 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించడానికి రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​ అనుమతించారు. సైనిక విద్యాసంస్థల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని.. తగినంతమంది మహిళా సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రెండేళ్ల క్రితం మిజోరంలోని చింగ్​చిప్​ సైనిక పాఠశాలలో బాలికలను చేర్పించడానికి రక్షణమంత్రిత్వశాఖ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో రాజ్​నాథ్​ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

"సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించాలనే నిర్ణయం మరింత సమగ్రంగా.. లింగసమానత్వానికి, సాయుధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించడానికి వీలుకల్పిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేసిన 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది." - రాజ్​నాథ్​సింగ్, రక్షణమంత్రి

ప్రభుత్వ పాఠశాల విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి, గరిష్ఠ సంఖ్యలో క్యాడెట్లను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సైనిక పాఠశాలలను రూపొందించింది.

ఇదీ చూడండి: ప్రత్యేక రైలులో విహారం.. బుద్ధుడి చారిత్రక ప్రదేశాల వీక్షణం

Mahendragarh (Haryana), Oct 18 (ANI): Former Congress president Rahul Gandhi on October 18 held a public rally in Haryana's Mahendragarh. While addressing the gathering, he said that unemployment rate in the country is highest since 40 years. "This is not the case of one state, you go in any state and ask the youth that what they do, they say nothing there is no work. Go to small shopkeeper, small businessmen and middle size businessmen who are the backbone of the country and ask them about their work they say that their work is ruined because of GST and demonetisation," said Gandhi. Assembly Elections will be held in Maharashtra and Haryana on October 21. Results will be announced three days later.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.