ETV Bharat / bharat

'వీర సైనికులను కోల్పోవడం ఎంతో బాధాకరం' - హంద్వారా ఎన్​కౌంటర్​

హంద్వారా ఎన్​కౌంటర్​లో భద్రతా సిబ్బందిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఉగ్రవాదంపై పోరులో వారు చేసిన త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని ట్వీట్​ చేశారు.

Deeply disturbing and painful: Rajnath on killing of 5 security personnel in Kashmir
'వీర సైనికులను కోల్పోవడం ఎంతో బాధాకరం'
author img

By

Published : May 3, 2020, 1:13 PM IST

జమ్ముకశ్మీర్​ హంద్వారా ఎన్​కౌంటర్​పై రక్షణమంత్రి రాజనాథ్​ సింగ్​ స్పందించారు. ఉగ్రవాదులపై పోరులో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. భారత సైనికులు ధైర్యసాహసాలను ప్రదర్శించారని.. వారి త్యాగాన్ని దేశం మరిచిపోదని ట్వీట్​ చేశారు.

  • The loss of our soldiers and security personnel in Handwara(J&K) is deeply disturbing and painful. They showed exemplary courage in their fight against the terrorists and made supreme sacrifice while serving the country. We will never forget their bravery and sacrifice.

    — Rajnath Singh (@rajnathsingh) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హంద్వారాలో జవాన్లు, భద్రతా సిబ్బందిని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో వారు ఎనలేని ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దేశం కోసం అతిపెద్ద త్యాగం చేశారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలు ఎన్నటికీ మరచిపోము. వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నా. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు దేశం అండగా ఉంటుంది."

-- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

శనివారం రాత్రి జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హంద్వారా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. ఇందులో కల్నల్​, మేజర్​ కూడా ఉన్నారు.

'గర్వపడుతున్నాం..'

ప్రజలను రక్షించాలన్న భద్రతా దళాల సంకల్పానికి హంద్వారా ఎన్​కౌంటర్​ సాక్ష్యమని త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ అన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టి ధైర్య సాహసాలను చూపిన వారి పట్ల సైన్యం గర్వంగా ఉందని పేర్కొన్నారు. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.