ETV Bharat / bharat

లష్కరే తోయిబా టాప్​ కమాండర్ హైదర్ హతం - Chanjmulla terrorists

Colonel and a Major were among five security personnel killed in an encounter
ఉగ్రవాదుల దుశ్చర్య.. ఐదుగురు మృతి
author img

By

Published : May 3, 2020, 8:39 AM IST

Updated : May 3, 2020, 1:38 PM IST

13:34 May 03

లష్కరే తోయిబా టాప్​ కమాండర్ హైదర్ హతం

ఉత్తర్​ కశ్మీర్​లో హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్​ కమాండర్ హైదర్ హతమైనట్లు  కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.

08:59 May 03

జమ్ముకశ్మీర్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. ఇందులో కల్నల్​, మేజర్​ కూడా ఉన్నారు.  

ఛాంజ్​ముల్లాలో ఉగ్రవాదులు.. పౌరుల్ని బందీలుగా ఉంచారాన్న సమాచారంతో రక్షించేందుకు వెళ్లింది సైనిక బృందం. పసిగట్టిన ఉగ్రముఠా.. వారిపై కాల్పులు జరిపింది. తిప్పికొట్టిన భారత సైన్యం.. ఇద్దరు ముష్కరుల్ని హతమార్చింది. అయితే.. ఇద్దరు సైనికాధికారులు సహా మొత్తం ఐదుగురు అమరులయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

21 రాష్ట్రీయ రైఫిల్స్​ విభాగంలో కమాండింగ్​ ఆఫీసర్​ పనిచేస్తున్న కల్నల్​ అశుతోష్​ శర్మ.. గతంలో ఎన్నో ఉగ్ర నిరోధక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. 

08:36 May 03

ఉగ్రవాదుల దుశ్చర్య.. ఐదుగురు మృతి

ఉత్తర కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హంద్వారా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్​, మేజర్​ సహా సైన్యానికి చెందిన మొత్తం ఐదుగురు వీరమరణం పొందారు. 

Last Updated : May 3, 2020, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.