ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లలో 'దీప్‌ సిధు' పాత్రేంటీ? - దీప్​ సిద్ధును అనుమానించిన రైతు సంఘాలు

కిసాన్​ పరేడ్​ అల్లర్ల నేపథ్యంలో.. పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిధు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎర్రకోట ఉద్రిక్తతలకు ఇతడే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్రిక్తతలు జరిగేలా ఆయన రైతులను రెచ్చగొట్టారని దుయ్యబట్టాయి. ఇంతకీ ఈ దీప్‌ సిధు ఎవరు..?

deep sidhu responsible for delhi farmers violence
దిల్లీ అల్లర్లు.. 'దీప్‌ సిధు' పాత్రేంటీ?
author img

By

Published : Jan 27, 2021, 3:11 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కిసాన్‌ పరేడ్‌లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన కర్షకులు హస్తిన నడిబొడ్డులో ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరేశారు. దీంతో అల్లర్లు చెలరేగి దేశ రాజధాని అట్టుడికిపోయింది. అయితే ఇది తమ పనికాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిధు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎర్రకోట ఉద్రిక్తతలకు ఇతడే కారణమని భావిస్తున్న అధికారులు.. దీనిపై నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ దీప్‌ సిధు ఎవరు..?

పంజాబ్‌కు చెందిన దీప్‌ సిధు ప్రముఖ గాయకుడు. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించారు. ముందు నుంచీ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్న సిధు.. రెండు రోజుల క్రితం మరోసారి దిల్లీకి వచ్చారు. సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా మంగళవారం జరిగిన కిసాన్‌ పరేడ్‌లోనూ సిధు పాల్గొన్నారు. ఎర్రకోట వద్ద రైతులు తమ జెండాతో పాటు సిక్కు జెండాలను ఎగరేసిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు.

delhi farmers violence
ఎర్రకోటపై జెండా ఎగరేసిన నిరసనకారులు

సిధుపైనే అనుమానాలు..

మంగళవారం ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పరిణామాలకు సిధునే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్రిక్తతలు జరిగేలా ఆయన రైతులను రెచ్చగొట్టారని దుయ్యబట్టాయి. "మా ఉద్యమాన్ని కించపరిచేందుకు కొన్ని సంఘ విద్రోహశక్తులు చేరాయి. ఎర్రకోటపై జెండాలు ఎగరవేయాలనేది మా ప్రణాళికలో లేదు. ప్రధానితో దీప్‌ సిధు ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాకు ఆయనపై అనుమానాలున్నాయి" అని కిసాన్‌ మజ్‌దూర్‌ సంఘర్ష్‌ కమిటీ నేత ఎస్‌ఎస్‌ పందేర్‌ తెలిపారు.

అటు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. "దీప్‌ సిధు సిక్కు కాదు. ఆయన భాజపా కార్యకర్త. ప్రధానితో ఆయన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది రైతుల ఉద్యమం. బారికేడ్లను ధ్వంసం చేయడం మా ఉద్యమంలో భాగం కాదు. అదంతా విద్రోహుల పని" అని ఆయన ఆరోపించారు. అయితే జరిగిన ఘటనలపై ఉద్యమంలో ఒక భాగస్వామిగా సిగ్గుపడుతున్నానని, వాటికి బాధ్యత వహిస్తానని తెలిపారు.

సిధును తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దే ఉన్నారని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ ఓ టీవీ కార్యక్రమంలో తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీకి ముందు రోజు కూడా సిధు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై తాను పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ఎర్రకోటకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

delhi farmers violence
ఉద్రిక్తంగా మారిన కిసాన్ పరేడ్

ఎన్‌ఐఏ నోటీసులు

ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్లర్లకు కారణంగా భావిస్తున్న సిధుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆందోళనకారులను ఎర్రకోటపైకి వెళ్లేందుకు ప్రోత్సహించడం, సామాజిక మాధ్యమాల్లో పంజాబీ యువకులను రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేసిన ఆరోపణలపై నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. రైతుల ఆందోళన వ్యవహారంలో సిధుకు గతంలో పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబరులో, ఈ నెల 16న నోటీసులు పంపినా ఆయన విచారణకు రాలేదు.

ఆరోపణలు ఖండించిన సిధు..

దిల్లీ అల్లర్ల నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను సిధు ఖండించారు. ఎర్రకోట ఘటన జరిగిన కాసేపటి తర్వాత సోషల్‌మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. "అంతమంది రైతులు ఎర్రకోట వెళ్లేలా నేను ఎలా ప్రోత్సహించగలను. ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నట్లు ఉన్న ఒక్క వీడియో కూడా లేదు" అని అన్నారు.

సినీ నేపథ్యం ఉన్న సిధు గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, నటుడు సన్నీ దేఓల్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మధ్య సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రకోట అల్లర్ల తర్వాత సిధు ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవడం గమనార్హం.

ఇదీ చదవండి:దిల్లీ హింసాత్మక ఘటనలపై సుప్రీంలో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.