ETV Bharat / bharat

'తక్కువ కరోనా మరణాలు- ఎక్కువ రికవరీలు'

కరోనా మరణాల రేటు భారత్​లోనే తక్కువగా ఉందని కేంద్ర వైద్య శాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.5శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్‌ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 3.4రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు 75.92 శాతానికి చేరినట్లు పేర్కొంది.

Decline in COVID-19
తక్కువ కరోనా మరణాలు- ఎక్కువ రికవరీలు
author img

By

Published : Aug 25, 2020, 7:06 PM IST

ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర వైద్య శాఖ మరోసారి స్పష్టం చేసింది. తక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది. పాజిటివిటీ రేటు కూడా తగ్గుతున్నట్లు వెల్లడించింది. ఆగస్టు తొలి వారంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11శాతం ఉండగా ప్రస్తుతం అది 8శాతానికి తగ్గిందని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.58శాతం ఉండగా, మరో 22.2శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. యాక్టివ్‌ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 3.4రెట్లు అధికంగా ఉన్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.92శాతం ఉందని తెలిపారు.

100 శాతానికిపైగా రికవరీ

కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటం వల్ల దేశంలో యాక్టివ్ కేసుల లోడ్ తగ్గుతోందని చెప్పారు రాజేష్. ప్రస్తుతం దేశంలో 7,04,348 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. గత 25 రోజుల్లో రికవరీల సంఖ్య 100 శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు.

  • యాక్టివ్ కేసుల్లో 2.7 శాతం బాధితులకు కృత్రిమంగా ఆక్సిజన్​ అందిస్తున్నారు.
  • 1.92 శాతం మంది ఐసీయూలో ఉంటున్నారు.
  • 0.29 శాతం మంది బాధితులు వెంటిలేటర్​పై ఉన్నారు.
  • కరోనా మరణాలలో పురుషులు 69 శాతంగా ఉంటే.. మహిళలు 31 శాతం.

టెస్టులు ఇలా...

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3కోట్ల 68లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఫలితంగా ప్రతి పది లక్షల జనాభాకు కరోనా టెస్టుల సంఖ్య 26,685కి చేరినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు పెరుగుతున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గడం ఊరట కలిగించే విషయమని వైద్య శాఖ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. పది లక్షల మందికి ఆగస్టు 1న 363 పరీక్షలు చేస్తే.. ప్రస్తుతం 600 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 30న రోజుకు 10 టెస్టులు జరిగితే ఆగస్టు 21న ఈ సంఖ్య పది లక్షలకు చేరిందని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ పేర్కొన్నారు.

టీకాపై

మరోవైపు, రష్యా వ్యాక్సిన్​కు సంబంధించి ఇరుదేశాలు మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు భూషణ్ తెలిపారు. టీకాపై ప్రాథమిక సమాచారం అందిందని, పూర్తి వివరాల కోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి- ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష ఖరారుపై తీర్పు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.