మహారాష్ట్ర సతారా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఉదయం ఓ ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు... ట్రక్కును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.