ఓ వ్యక్తి చనిపోయాడనుకొని శవపరీక్షకు సన్నాహాలు చేస్తుండగా.. అకస్మాత్తుగా లేచి కూర్చుకున్నాడు. ఈ వింత ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది.
కానీ.. మరణించాడు
విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి ఖార్తా గ్రామంలో నివాసముంటున్నాడు. గుడారాలను తొలగిస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి ఆసుపత్రిలో చేరాడు. పరిశీలించిన వైద్యులు అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం శవపరీక్ష కోసం తీసుకెళ్తున్న సమయంలో అతను ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నట్లు బంధువులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారమిచ్చి అత్యవసర విభాగానికి తీసుకెళ్లాలని కోరారు. మరోమారు అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే, మృతుడి బంధువులు మాత్రం వైద్యుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు.
నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.