కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా.. యడ్యూరప్ప డైరీ ఉదంతంలో నిరాధార ఆరోపణలు చేశారన్న కారణంతో భారతీయ జనతా పార్టీ.. పోలీసులకు ఫిర్యాదు చేయనుంది.
డైరీలో ఉన్నట్లు అవినీతి జరిగిందా? లేదా? అన్నది ప్రధానమంత్రి స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా డిమాండ్ చేశారు.
నకిలీదని తేల్చిన ఐటీ విభాగం..
ఇటీవల యడ్యూరప్పకు చెందినదిగా భావించిన ఒక డైరీ బయటకు వచ్చింది. ఇందులో భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయి నాయకత్వానికి మాజీ ముఖ్యమంత్రి రూ. 1,800 కోట్లు చెల్లించారని ఉంది. దీనిపై దర్యాప్తు చేయించాలని రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.
ఈ డైరీ నకళ్లను శనివారం ఆదాయపు పన్ను విభాగానికి అప్పగించగా నకిలీవని తేల్చిచెప్పింది.
రాహుల్ క్షమాపణలు చెప్పాలి...
కారవాన్ మ్యాగజైన్ ఆధారంగా 'భాజపా నేతలంతా అవినీతి పరులేనని' రాహుల్ గాంధీ ఇటీవల ఒక ట్వీట్ చేశారు. దీనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భాజపా అధికార ప్రతినిధి ఎమ్మెల్యే ఎస్. సురేష్ కుమార్.