ETV Bharat / bharat

ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారం- ఇద్దరు అరెస్ట్​

దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్​లో ఇటీవల ఓ మహిళ అడవికి వెళ్లగా.. అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

Dalit woman gang-raped in Sehore, Madhya Pradesh and two arrested: Police
దళిత మహిళపై సామూహిక అత్యాచారం- ఇద్దరు అరెస్ట్​
author img

By

Published : Oct 11, 2020, 3:25 PM IST

దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్​లో తాజాగా ఓ ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది..

ఈ నెల 7న సీహోర్​లో ఓ మహిళ మలవిసర్జన కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది. అదే సమయంలో ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు బాధితురాలు స్థానిక పోలిస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనలో దేవాస్​ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు(ధర్మేంద్రసింగ్​ రాజ్​పుత్​, భావర్​సిగ్​ రాఠోడ్​​)ను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్​-376 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సోమవారం కోర్టు ముందుకు 'హాథ్రస్' కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.