ETV Bharat / bharat

2 రాష్ట్రాలు.. 3 గంటలు.. నిసర్గ తుపాను విలయం

author img

By

Published : Jun 3, 2020, 8:34 PM IST

Updated : Jun 3, 2020, 9:37 PM IST

నిసర్గ.. మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రాయ్​గఢ్​​ జిల్లా అలీబాగ్​ సమీపంలో తీరం దాటింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీరం దాటిన క్రమంలో ఎన్​డీఎర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పుణె జిల్లాలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Cyclone Nisarga
నిసర్గ విలయం

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను.. తీరం దాటింది. మహారాష్ట్రలోని రాయగడ్​ జిల్లా అలీబాగ్​ సమీపంలో తీరం తాకగా.. మూడు గంటల పాటు తుపాను బీభత్సం కొనసాగింది. తుపాను ధాటికి మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు, భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంత నగరమైన ముంబయి అతలాకుతలమైంది. తపాను తీరం దాటిన నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

సాయంత్రం 4 గంటలకు..

బుధవారం మధ్యాహ్నం 1 గంటకు అలీబాగ్​లో తీరం తాకిన నిసర్గ.. సాయంత్రం 4 గంటలకు తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటిన తర్వాత తుపాను బలహీన పడడం ప్రారంభమైందని తెలిపింది. ప్రస్తుతం 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, అర్ధ రాత్రి వరకు పూర్తి స్థాయిలో తుపాను తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ.

3 గంటలు.. 2 రాష్ట్రాలు.. నిసర్గ తుపాను విలయం

ఇద్దరు మృతి..

తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో పుణె జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు అధికారులు. ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

రెండు రోజుల పాటు బయటకి రావొద్దు..

ముంబయి సహా రత్నగిరి, పాల్ఘర్​, సింధు దుర్గ్​, రాయ్​గఢ్​, ఠాణె జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముంబయిలో 144 సెక్షన్​ విధించి.. అత్యవసరం అయితే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్దని బృహత్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే సూచించారు.

సురక్షిత ప్రాంతాలకు లక్ష మంది..

Cyclone Nisarga
గాలులకు ధ్వంసమైన ఓ పాఠశాల పైకప్పు

మహారాష్ట్ర, గుజరాత్​లోని తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు ఒక లక్ష మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు ఎన్డీఆర్​ఎఫ్ అధికారులు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 43 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

35 పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది బృహత్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​. తుపాను తీరం తాకే సమయానికే 10,840 మందిని శిబిరాలకు తరలించారు. అలాగే దక్షిణ ముంబయిలోని కొలాబా, వర్లీ, దాదార్​, సెంట్రల్​ ముంబయి, జుహూ, వెర్సోవో వంటి ప్రాంతాలపై ప్రభావంతో మరో 30వేల మందిని శిబిరాలకు తీసుకెళ్లారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి వారి ప్రాంతాలకు పంపుతామని తెలిపారు.

గుజరాత్​లోని తీర ప్రాంత జిల్లాలైన వల్​సడ్​, సూరత్​, నవ్​సారి, బరూచ్​లో సుమారు 78 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. అయితే, రాష్ట్రంపై తుపాను ప్రభావం అంతగా కనిపించలేదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.

భారీ వృక్షాలు నేలమట్టం..

Cyclone Nisarga
భారీ వృక్షాలు నేల కూలి ధ్వంసమైన కార్లు

నిసర్గ తుపాను అలీబాగ్​ ప్రాంతంలో తీరం తాకగా సుమారు 120 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు, భారీ వర్షం పడింది. దీంతో చిన్న చిన్న ఇళ్లు, రేకుల షెడ్లు, భవనాలపై ఉన్న తాత్కాలిక షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రాయ్​గఢ్​​ జిల్లాలో 65 గ్రామాలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలోని తీర ప్రాంతాలతో పాటు రోహా, తాలా, సుభగద్​, ఖలాపుర్​, మంగావున్​, పన్వెల్​, పొలాద్​పుర్​ వంటి నగరాల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

పక్షుల మృత్యువాత..

Cyclone Nisarga
చలికి వణుకుతూ పక్షుల మృతి

నిసర్గ తుపాను సృష్టించిన విలయంతో అనేక పక్షులు మృతి చెందాయి. ఈదురు గాలుల ధాటికి గూళ్లు చెదిరి.. ప్రాణాలొదిలాయి. వర్షపు నీటిలో పూర్తిగా తడిసి.. చలిగాలికి వణుకుతూ ప్రాణాలు కోల్పోయాయి.

72 ఏళ్ల తర్వాత భారీ తుపాను..

ముంబయి దాని పరిసర ప్రాంతాల్లో నిసర్గ తుపాను బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. తీరం దాటేందుకు కొద్ది గంటల సమయమే తీసుకున్నా చేయాల్సిన నష్టం చేసి వెళ్లింది. ఇంత భారీ స్థాయిలో ముంబయిని తుపాను తాకటం 72 ఏళ్లలో తొలిసారని పేర్కొన్నారు కొలంబియా విశ్వవిద్యాలయ వాతావరణ విభాగం ప్రొఫెసర్​ ఆడమ్​ సోయిబెల్​. గతంలో 1948లో ఈ స్థాయిలో ముంబయిని తుపాను తాకిందని తెలుపుతూ ట్వీట్​ చేశారు.

రైళ్లు, విమానసేవలు బంద్​..

తుపాను ధాటికి మహారాష్ట్రలో రైళ్లు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముందుగా బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన సేవలను నిలిపివేసినప్పటికీ.. సాయంత్రం 6 గంటలకే పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. పలు రైళ్లను రద్దు చేయగా మరి కొన్నింటిని దారి మళ్లించారు.

Last Updated : Jun 3, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.