ETV Bharat / bharat

తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం

తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుపాను క్రమక్రమంగా ఉత్తర, ఈశాన్యంవైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గాలి వేగం గంటకు 20 కి.మీ నుంచి 24 కి.మీకి పెరిగినట్లు స్పష్టం చేసింది. గుజరాత్, మహారాష్ట్ర సహా అరేబియా తీరంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో తుపాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

nisarga
నిసర్గ
author img

By

Published : Jun 3, 2020, 5:37 AM IST

Updated : Jun 3, 2020, 6:17 AM IST

భారత పశ్చిమ తీరంలో ఏర్పడిన తుపాను క్రమంగా తీరం వైపు కదులుతోంది. తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ.. ఉత్తర, ఈశాన్యంవైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గాలి వేగం గంటకు 20 కి.మీ నుంచి 24 కిలోమీటర్లకు పెరిగినట్లు స్పష్టం చేసింది.

మంగళవారం అర్థరాత్రి నాటికి తుపాను బలపడి తీవ్రమైన తుపానుగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్​ వద్ద తుపాను తీరం దాటుతుందని స్పష్టం చేసింది. గంటకు 100-110 కి.మీల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రాయ్​గఢ్ జిల్లాలో గరిష్ఠంగా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబయి నగరం సహా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఠాణె, పాల్గర్, రాయ్​గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్​ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

మహారాష్ట్ర అప్రమత్తం

మహారాష్ట్రలో తుపాను ప్రభావం ఉన్న పాల్గర్​ జిల్లాలోని 21 వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దహాను-అగర్ గ్రామంలోని దాదాపు 70 కుటుంబాలను సమీపంలోని హాస్టల్​కు తరలించారు. తుపాను తీరం దాటే వరకు రసాయన కర్మాగారాలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4 వరకు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించారు.

భారీ వర్షాలు

తుపాను తీరానికి చేరువలో ఉన్న వేళ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి సహా రాయ్​గఢ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం రాత్రికి ఊపందుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

సహాయక బృందాలు సిద్ధం

తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సహాయక కార్యక్రమాల కోసం మహారాష్ట్ర, గుజరాత్ సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో 40 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను మోహరించారు. మరిన్ని అదనపు బృందాలను ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​తో పాటు సైన్యం, వాయు సేన బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

బఠిండా, విజయవాడ నగరాల నుంచి మొత్తం 10 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను గుజరాత్, మహారాష్ట్రలకు చేరవేశారు. ఇందులో 5 బృందాలను గుజరాత్​లోని సూరత్​కు పంపినట్లు ఎన్​డీఆర్​ఎఫ్ డీజీ ఎస్​ఎన్ ప్రధాన్ స్పష్టం చేశారు.

ఎయిర్​పోర్ట్​

నిసర్గను ఎదుర్కొనేందుకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రయాణికులు, విమానాలు సహా విమానాశ్రయానికి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం కలగకుండా.. డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతికూల పరిస్థితుల్లో సహాయం అందించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్​సీఎంసీ ఆరా

మరోవైపు.. తుపాను ఎదుర్కొనేందుకు అధికారుల సన్నద్ధతపై కేంద్ర విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్​సీఎంసీ) సమీక్ష నిర్వహించింది. కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా అధ్యక్షతన రెండోసారి సమావేశమైన ఎన్​సీఎంసీ... రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల సన్నద్ధతపై ఆరా తీసింది.

విమానాలు, రైళ్లు వాయిదా

తుపాను ప్రభావం నేపథ్యంలో ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 19 విమానాలను రద్దు చేశారు అధికారులు.

మరోవైపు 5 ప్రత్యేక రైళ్లను వాయిదా వేస్తున్నట్లు మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 3న ముంబయి నుంచి బయల్దేరాల్సిన రైళ్లు సహా.. ముంబయికి రావాల్సిన 3 ప్రత్యేక రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపింది.

గుజరాత్ అప్రమత్తం

తుపాను నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంత జిల్లాలైన వల్సద్‌, సూరత్‌, నవ్‌సారి, బహరూచ్‌ జిల్లాల్లోని 78 వేల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. తుపాను ప్రభావం గుజరాత్‌పై తక్కువే ఉండే అవకాశం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్​

Last Updated : Jun 3, 2020, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.