ETV Bharat / bharat

ఒడిశాలో ఫొని విధ్వంసానికి 12 మంది బలి

ప్రచండ గాలులతో ఒడిశా తీరాన్ని తాకిన 'ఫొని' తుపాను రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలతో తీరప్రాంతం అతలాకుతలం అయింది. తుపాను ధాటికి 12 మంది మృతి చెందారు.

ఫొని
author img

By

Published : May 4, 2019, 4:32 PM IST

Updated : May 4, 2019, 7:46 PM IST

ఒడిశాలో ఫొని విధ్వంసం

'ఫొని' తుపాను విధ్వంసం ఒడిశాను కకావికలం చేసింది. శుక్రవారం ఉదయం ఒడిశా తీరాన్ని ఢీకొట్టిన తుపాను ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 10వేల గ్రామాలు, పట్టణాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు అధికారులు.

భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. భారీ స్థాయిలో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. 12 లక్షల మంది తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

"ఇది చాలా అరుదైన, తీవ్రమైన తుపాను. 43 ఏళ్లలో అత్యంత ప్రమాదకరమైనది. 150 ఏళ్లలో చూస్తే మూడింటిలో ఒకటిగా నిలిచింది. ఈ కారణంగానే ఫొనిని ఓ సవాల్​గా తీసుకున్నాం. మా ప్రభుత్వానికి ప్రతి ప్రాణం ముఖ్యమే. అదే లక్ష్యంగా పనిచేశాం. 12 లక్షల మంది ప్రాణాల కోసం కృషిచేసిన వలంటీర్లు, ప్రభుత్వోద్యోగులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మన పని మౌలిక సదుపాయాల పునరుద్ధరణే. ఒడిశా ఇంతలా మారేందుకు సహకరించిన 2.5కోట్ల మంది ప్రజలకు అభినందనలు."
-నవీన్​ పట్నాయక్, ఒడిశా సీఎం

పూరీలో భారీగా నష్టం

పూరీ జిల్లాకు అత్యంత నష్టం వాటిల్లింది. గంటకు 175 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్​ స్తంభాలు, వేలాది చెట్లు కూలిపోయాయి. పూరీ, భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్లలో పైకప్పులు ఎగిరిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కుంభవృష్టి కారణంగా పూరీ సహా తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లోని ఇళ్లు నీట మునిగాయి.

యుద్ధప్రాతిపదికన... 4 వేల మందితో కూడిన 81 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, స్థానిక యంత్రాంగం తుపాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థల పునరుద్ధరణకు మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

నీట్​ వాయిదా

తుపాను నేపథ్యంలో ఒడిశాలో నీట్​ పరీక్షను వాయిదా వేసింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఒడిశాలో రేపు నీట్​ పరీక్ష జరగాల్సి ఉంది. తదుపరి తేదీని త్వరలో తెలియపరుస్తామని మానవ వనరుల శాఖ కార్యదర్శి ఆర్​. సుబ్రమణియం ప్రకటించారు.

ఇదీ చూడండి: ఫొని బీభత్సం-అస్తవ్యస్తంగా ఒడిశాలో జనజీవనం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Moshe Cohen ++NO CREDIT REQUIRED++
Ashkelon – 4 May 2019
++MOBILE PHONE FOOTAGE++
1. Israeli Iron Dome missile defence rocket being launched, intercepting a rocket believed to be from Gaza AUDIO: sirens
STORYLINE:
The Israeli military on Saturday intercepted rockets it said were being fired by Palestinian militants from the Gaza Strip.
Sirens warning of incoming projectiles sounded in southern Israel.
In response, Israeli aircraft targeted two launch sites in northern Gaza. Local media reported three Palestinian casualties.
The deadly flare-up between Israel and Gaza militants enters a second day, shattering a monthlong Egyptian-mediated easing of hostilities.
On Friday, Israel said two soldiers were wounded by gunshots from the Hamas-controlled territory. No group claimed responsibility for the shooting.
Israeli aircraft carried out retaliatory strikes, killing two Hamas militants. Two other Palestinians were killed during the weekly protests along the Israel-Gaza perimeter fence.
Egypt has been trying to reach a long-term cease-fire between Hamas and Israel, who fought three wars the past decade.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 4, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.