ETV Bharat / bharat

సైకిల్​పై యావత్​ దేశాన్ని చుట్టేస్తున్న తెలుగమ్మాయి! - జ్యోతి

ఎవరి మద్దతు, డబ్బు లేకుండా యావత్​ దేశాన్ని సైకిల్​పై చుట్టేస్తోంది ఓ తెలుగమ్మాయి. ఇప్పటికే 19 రాష్ట్రాల్లో పర్యటించింది. ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి ఈ యాత్ర చేపట్టడం వెనుక కారణమేంటి..?

సైకిల్​పై యావత్​ దేశాన్ని చుట్టేస్తున్న తెలుగమ్మాయి!
author img

By

Published : Sep 13, 2019, 12:38 PM IST

Updated : Sep 30, 2019, 10:49 AM IST

సైకిల్​పై యావత్​ దేశాన్ని చుట్టేస్తున్న తెలుగమ్మాయి!

జ్యోతి రొంగల... ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించిన జ్యోతి... యావత్​ దేశాన్ని సైకిల్​పై చుట్టేయాలని నిర్ణయించుకుంది. ఎవరి సాయం లేకుండా డబ్బు వినియోగించకుండా ఈ యాత్ర చేపట్టింది. ఇప్పటికే 16 వేల కి.మీ యాత్ర పూర్తిచేసింది. తాజాగా నాగాలాండ్​లోని దిమాపుర్​కు చేరుకుంది.

ఎందుకు..?

ఇప్పటివరకు సుదూర సైకిల్​ యాత్ర రికార్డ్​ 18,999 కి.మీ ప్రయాణించిన ఆస్ట్రేలియావాసి పేరిట ఉంది. ఈ రికార్డ్​పై కన్నేసింది జ్యోతి. మొత్తం 30 వేల కి.మీ ప్రయాణించేందుకు ప్రణాళిక వేసుకుంది.

"నేను సైకిల్​పై అన్ని రాష్ట్రాల్లోనూ తిరుగుతూ దేశవ్యాప్తంగా యాత్ర చేయాలనుకుంటున్నాను. డబ్బు లేకుండా ఒంటరిగా తిరుగుతున్నాను. 30 వేల కి.మీ తిరగడమే నా లక్ష్యం. ఇప్పటికే 19 రాష్ట్రాలు పూర్తి చేశాను. గిన్నిస్​ రికార్డ్​ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ యాత్ర ద్వారా భారత్​లోని రోడ్లు మహిళలకు సురక్షితమనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను."
- జ్యోతి రొంగల, సైకిల్​ యాత్రికురాలు

ఎలా..?

జ్యోతితో పాటు సైకిల్​ సామగ్రి, స్లీపింగ్​ బ్యాగ్, టెంట్​, ప్రథమ చికిత్స కిట్, మొబైల్​ మాత్రమే ఉన్నాయి. కొన్నిచోట్ల స్థానికుల ఆతిథ్యం స్వీకరిస్తుంది. ఒక్కొక్క సమయంలో సరైన తిండి, నివాసం లేక ఇబ్బంది పడినా... అలానే ముందుకు సాగుతోంది.

2017 జనవరిలో యాత్ర ప్రారంభించింది జ్యోతి. 9 వేల కి.మీ పూర్తి చేశాక గాయమైంది. ఏడాదిన్నర పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ 2019 జనవరిలో ఈ సైకిల్​ యాత్ర పునఃప్రారంభించింది.

అదే లక్ష్యం...

అర్ధరాత్రి ఒంటరిగా... రోడ్డుపై మహిళలు తిరిగగలిగిన నాడే నిజమైన స్వాంతంత్ర్యమని మహాత్మాగాంధీ అన్నారు. అయితే ఒంటరిగా సైకిల్​పై దేశ యాత్ర చేస్తూ భారత్​లోని రోడ్లు మహిళలకు సురక్షితమనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది జ్యోతి.

Firozabad (Uttar Pradesh), Sep 13 (ANI): A college in Uttar Pradesh's Firozabad district has banned entry of girl students wearing Islamic hijab or burqa. The decision came in the wake of a clash between two student groups. Some students were allegedly denied entry to SRK College because they were wearing burqa. The management of SRK College has justified the ban saying anti-social elements freely enter the college premises and create trouble. The college administration has also set a dress code for students. While speaking to media, Principal of SRK College said, "It is an old order that students have to wear uniform and carry ID card. Burqa isn't included in uniform. Now, this order is being implemented."
Last Updated : Sep 30, 2019, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.