ఝార్ఖండ్‌లో ఓ న్యాయవాదినే బురిడీ కొట్టించాడు సైబర్ నేరగాడు. ఫేస్బుక్లో యువతి పేరిట ప్రొఫైల్ క్రియేట్ చేసి, రూ.16 లక్షలు కాజేశాడు.
ఇదీ జరిగింది
జంషెద్పుర్కు చెందిన ఓ యువ న్యాయవాది పెళ్లి చేసుకోదలచి తన ఫొటో, ఇతర వివరాల్ని ఓ మాట్రిమోని వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఆ సమాచారం చూసిన ఓ సైబర్ నేరగాడు... న్యాయవాదికి ఎర వేశాడు.
ఫేస్బుక్లో ఓ నకిలీ ఖాతా సృష్టించి, గుర్తు తెలియని అందమైన యువతి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు ఆ కేటుగాడు. మెల్లమెల్లగా న్యాయవాదితో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకుని ముగ్గులోకి దింపాడు. తనని పెళ్లిచేసుకుంటానని నమ్మబలికాడు.
ఫొటోకు రూ. 10 వేలు
న్యాయవాదిని పూర్తిగా నమ్మించానని అనుకున్నాక డబ్బులు రాబట్టే పని మొదలు పెట్టాడు ఆ కేటుగాడు. ఏదో అత్యవసరం ఉందని అడిగి తొలుత రూ.10 వేలు తీసుకున్నాడు. తర్వాత న్యాయవాది ఫొటో పంపమని అడగగా మరో రూ.10 వేలు రాబట్టాడు. ఇలా విడతల వారీగా రూ.16 లక్షలు కాజేశాడు.
న్యాయవాది కలుద్దామన్న ప్రతిసారీ ఏదో వంక చెప్పి తప్పించుకునేవాడు. చివరకు ఓ సారి తప్పనిసరిగా కలవాలని తెగేసి చెప్పగా... ఫేస్బుక్ ఖాతాను డీయాక్టివేట్ చేసేశాడు.
మోసపోయానని గ్రహించిన న్యాయవాది... పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి : బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టబోయిన జగన్