పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం తీవ్ర స్థాయి హింసాత్మక ఆందోళనలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన కర్ణాటకలోని మంగళూరు క్రమంగా కుదుటపడుతోంది. ప్రశాంత పరిస్ధితులు నెలకొంటూ ఉండటం వల్ల క్రమంగా కర్ఫ్యూను సడలిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.
అల్లర్ల సమయంలో పోలీసు కాల్పుల్లో మంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఇద్దరి కుటుంబాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప పరామర్శించారు. నిబంధనల ప్రకారం వారి కుటుంబానికి పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం నుంచి ఉదయం పూట కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తామని ఆయన తెలిపారు. అల్లర్లపై తగిన దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం