దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ ఆయిల్ కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి.
శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు లీటర్కు 25 పైసల చొప్పున పెరిగాయి. 10 రోజుల వ్యవధిలో చమురు ధరల్లో రూపాయికి పైగా పెరుగుదల కనిపించింది. దిల్లీలో పెట్రోల్ ధర రూ.85.45 గా ఉంది. డీజిల్ ధర రూ.75.63కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92 దాటింది. డీజిల్ ధర రూ.82.40గా ఉంది.
ఇదీ చదవండి: కొంపముంచిన ఆన్లైన్ స్నేహం- బాలికపై గ్యాంగ్ రేప్