ETV Bharat / bharat

'టీకా పంపిణీలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం' - కేంద్ర ఆరోగ్య శాఖ

జనవరి 16నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల సమర్థత, పంపిణీ ప్రక్రియ, డోసుల పరిమాణం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ వివరించారు. వీటి సమర్థతపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని.. స్వదేశంలో అభివృద్ది చేసిన ఈ రెండు వ్యాక్సిన్​లు సురక్షితమైనవేనని స్పష్టం చేశారు. టీకాల పంపిణీ వేళ ప్రజల భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.

vaccination from january 16
జనవరి 16నుంచి కరోనా టీకా
author img

By

Published : Jan 12, 2021, 6:09 PM IST

జనవరి 16న ప్రారంభం కానున్న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​ తెలిపారు. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లు రక్షణ, రోగ నిరోధక శక్తి విషయంలో అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు వివరించారు.

రెండు టీకాలు సురక్షితమైనవే..

స్వదేశంలో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లను అత్యవసర వినియోగం కింద ఆమోదించామని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌-వి, బయోలాజికల్‌-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా.. మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ప్రజల భాగస్వామ్యం ముఖ్యం..

కరోనా వ్యాక్సినేషన్ వేళ ప్రజల భాగస్వామ్యం అవసరమని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఈ ప్రక్రియ మొత్తం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించామని వివరించింది. టీకా పంపిణీ నేపథ్యంలో ఇతర ఆరోగ్య కార్యకలాపాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. టీకా పట్ల స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది.

16లక్షల డోసులు ఉచితం..

ఇప్పటికే సేకరించిన కరోనా వ్యాక్సిన్‌ల ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.295కు కొనుగోలు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మరో 16లక్షల 50వేల డోసులను కేంద్రానికి ఉచితంగా ఇవ్వాలని ఆ సంస్థ‌ నిర్ణయించిందన్నారు. సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి ఒక కోటి 10లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను‌ ఒక్కో డోసును రూ.200 వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: '13 నగరాలకు 56.5 లక్షల డోసుల టీకా పంపిణీ!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.