ETV Bharat / bharat

భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు - corona latest news

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 2 లక్షలకు పైగా కరోనా నిర్ధరణ‌ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 3లక్షల 81వేల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. జులై 30న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 6లక్షల 42వేల పరీక్షలు చేసినట్లు తెలిపింది. వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచే దిశగా చర్యలు చేపడుతోంది కేంద్రం.

Covid-Tests-in-India-Crosses-2-Crores
భారత్‌లో 2కోట్లు దాటిన కరోనా పరీక్షలు!
author img

By

Published : Aug 3, 2020, 1:34 PM IST

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే నిపుణులు స్పష్టం చేశారు. భారత‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. నిత్యం 3నుంచి 5లక్షల కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను చేపడుతోంది. ఆదివారం ఒక్కరోజే 3లక్షల 81వేల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత‌ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2కోట్ల 2లక్షల(2,02,02,858) పరీక్షలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. జులై 30న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 6లక్షల 42వేల పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

1300కు పైగా ల్యాబ్​లు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు 1348 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. వీటిలో 914 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా మరో 434 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. కొవిడ్‌ నిర్ధారణ కోసం ఈ ల్యాబ్‌లలో ప్రస్తుతం ఆర్‌టీ పీసీఆర్‌, ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాలను అనుసరిస్తున్నారు. జనవరి నెలలో దేశంలో ఒకేఒక్క కొవిడ్‌ నిర్ధరణ కేంద్రం ఉండగా ప్రస్తుతం 1300లకు పైగా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను భారీగా నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొవిడ్‌ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచారు.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో అత్యధికంగా తమ దేశమే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్ష భవనం వెల్లడించింది. ఇప్పటికే అక్కడ దాదాపు 6కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇక వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న రష్యాలోనూ భారీగానే టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండున్నర కోట్ల కొవిడ్‌ పరీక్షలు(ప్రైవేటు నివేదికల ప్రకారం) నిర్వహించారు. వీటి తర్వాత భారత్‌లోనే అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని దేశాలకంటే చైనా అత్యధిక కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తోందని చైనా మీడియా పేర్కొన్నప్పటికీ వీటికి సంబంధించిన అధికారిక సమాచారం లేదు. ప్రైవేటు నివేదికల ప్రకారం అక్కడ దాదాపు 9కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: రక్షాబంధన్​ ప్రత్యేకం: కరోనా యోధుల సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.