ETV Bharat / bharat

'ఆరోగ్య వ్యవస్థల బలోపేతం అవసరాన్ని కొవిడ్​ చాటింది' - డబ్ల్యూహెచ్​ఓ ఎగ్జిక్యూటివ్​ బోర్డ్​ మీటింగ్​

ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటం, సంసిద్ధతను విస్మరించటం వల్ల కలిగే పరిణామాలపై కొవిడ్​ మహమ్మారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. డబ్ల్యూహెచ్​ఓ ఎగ్జిక్యూటివ్​ బోర్డ్​ 147 సమావేశంలో వర్చువల్​గా పాల్గొని కీలక సూచనలు చేశారు. దేశాలన్ని కలిసికట్టుగా స్థిరమైన ఆరోగ్య వ్యవస్థలను తయారు చేసుకోవాలన్నారు.

Harsha vardhan
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
author img

By

Published : Nov 16, 2020, 9:41 PM IST

ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయకపోవటం వల్ల కలిగే పరిణామాలపై కొవిడ్​-19 ప్రపంచానికి అవగాహన కల్పించిందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. ప్రజారోగ్య రంగంలో ఆసక్తి, పెట్టుబడుల పునరుజ్జీవనానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

వర్చువల్​గా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్​ బోర్డ్​ 147వ సమావేశానికి హాజరయ్యారు కేంద్ర మంత్రి. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. సభ్య దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటూ.. అవసరమైన అభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచ ఆరోగ్య అంశాల అభివృద్ధికి అందరిని భాగస్వాములను చేయాలని నొక్కి చెప్పారు. ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరాన్ని 2020 ఏడాది చూపిందన్నారు. ప్రజలు ఇప్పటికే పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పులు, కాలుష్యం, వ్యాధుల వంటి సవాళ్లతో పోరాడుతున్నారని, ఇప్పుడు కరోనా మహమ్మారి కోట్లాది మంది ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.

" అందరికీ ఆరోగ్యం లేకుండా మంచి భవిష్యత్తు ఉండదు. అది మనందరికి తెలిసిన పాఠం. ఇప్పుడు మనందరం తిరిగి నేర్చుకోవాల్సిన పాఠం. సభ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటం, సంసిద్ధతను విస్మరించటం వల్ల కలిగే పరిణామాల గురించి ఈ మహమ్మారి మానవాళికి తెలియజేసింది. ఇలాంటి ప్రపంచ సంక్షోభం సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవటం, కట్టడి.. రెండూ ప్రపంచ ప్రజారోగ్య రంగాన్ని పునరుజ్జీవనం చేసేలా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు చాలా ముఖ్యం. "

- హర్షవర్ధన్​, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి.

ఆరోగ్య సేవలు, నాణ్యమైన మందుల ఉత్పత్తిని మెరుగుపరచటమే లక్ష్యంగా న్యాయ, సాంకేతిక సహకారం, పరిశోధన, కొత్త ఆవిష్కరణలు, డిజిటల్​ ఆరోగ్యం, భాగస్వామ్యాల ద్వారా ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని తెలిపారు హర్షవర్ధన్. ప్రస్తుత సంక్షోభం నుంచి నేర్చుకున్న పాఠాలను ఇప్పటికే గుర్తించి, వాటిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా కలిసికట్టుగా స్థిరమైన ఆరోగ్య వ్యవస్థలను సాధించగలమని సూచించారు. అది స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇస్తుందన్నారు.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తికి శీతాకాలం అనువైనది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.